Saturday, November 15, 2025
HomeదైవంParijat Flowers: అన్ని పూలది ఓ లెక్క.. పారిజాతం పుష్పాలది మరో లెక్క.. స్వర్గలోకపు చెట్టు...

Parijat Flowers: అన్ని పూలది ఓ లెక్క.. పారిజాతం పుష్పాలది మరో లెక్క.. స్వర్గలోకపు చెట్టు రహస్యమిదే.!

Parijat Flowers Story: దేవుని పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది తాజాగా వికసిస్తున్న పూలతో భగవంతునికి చేసే పుష్పార్చన. అందుకే రకరకాల పూలను తీసుకొచ్చి సృష్టికర్తకు సమర్పిస్తుంటాం. ప్రతి పువ్వులో దైవత్వాన్ని చూస్తూ.. పూజ అనంతరం వాటిని కళ్లకద్దుకుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంటాం. అయితే సాధారణంగా పూలని చెట్టుపై నుంచే కోస్తాం. కిందపడినవి పూజకి పనికిరావని చెబుతాం. కానీ ఇక్కడ పారిజాతం పుష్పాలు మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే దేవలోకం నుంచి శ్రీకృష్ణుడి ఇంట చేరిన ఈ దివ్యపుష్పం రాత్రి వేళ వికసించి, తెల్లవారుజామునే నేలపై రాలిపోతుంది. ఎంతో సువాసన, పవిత్రత ఉన్న ఈ పారిజాత పూలను నేరుగా చెట్టు నుంచి కోయకూడదని.. నేలరాలిన పూలనే భగవంతుని పూజకు వినియోగించాలని చెబుతారు. అయితే ఈ నియమం వెనుక దాగి ఉన్న పౌరాణిక రహస్యం ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-signs-that-bring-good-fortune-and-remove-obstacles/

ప్రాచీన పురాతన కథలను పరిశీలిస్తే.. పూర్వం పారిజాతక అనే ఒక రాకుమారి నిత్యం సూర్య భగవానుడిని ప్రేమిస్తూ ఆరాధనలో ఉండేది. కానీ సూర్యుడు ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపంతో పారిజాతక ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం అగ్నిలో దగ్ధమై, ఆ బూడిద నుంచే పారిజాత చెట్టు పుట్టిందని కథలుగా చెప్పుకుంటున్నారు. తనను తిరస్కరించిన సూర్యుడిని చూసేందుకు ఇష్టం లేక, ఈ చెట్టు రాత్రిపూట మాత్రమే వికసిస్తుందని.. తెల్లారిన తర్వాత ఆ పూలు నేల మీద రాలిపోవడంలో ఆమె బాధ ఉందని చెబుతారు. ఆ పారిజాతక రాకుమారి బాధను గౌరవిస్తూ, ఆ చెట్టు నుంచి పూలను బలవంతంగా కోయకుండా, అవి రాలిన తర్వాతే తీసుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. 

ఇక పురాణ రహస్యాలను చూసుకుంటే.. సాక్షాత్తు దేవతలు క్షీరసాగర మథనం జరిపేటప్పుడు పారిజాత వృక్షం ఉద్భవించినదని చెబుతారు. ఈ చెట్టును ఇంద్రుడు దేవలోకంలో ఉంచగా శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోసం భూలోకానికి తీసుకొచ్చాడని భాగవత పురాణంలో ఉంది. కోరికలు తీర్చే శక్తి ఈ చెట్టుకు ఉండటంతో నేల రాలిన పారిజాతం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/mars-transit-in-dhanu-rasi-2025-these-lucky-zodiac-signs-will-get-unexpected-money/

ప్రధానంగా శివపూజలో, దేవీ పూజలో కింద పడిన పూలను మాత్రమే వాడటం ద్వారా పారిజాతక రాకుమారి త్యాగాన్ని గౌరవించినట్లుగా ఉంటుందని.. తద్వారా ఆ పువ్వు పవిత్రత పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించాలనే భారతీయ సంస్కృతికి ప్రతీకగా పండితులు చెబుతున్నారు. పారిజాత పూలను కోయకుండా ఉండటం అనేది ప్రకృతి పట్ల, ఆ పువ్వు వెనుక ఉన్న త్యాగం పట్ల మనం చూపించే గౌరవంగా భావించాలని అంటారు. ఆ చెట్టు నుంచి నేల రాలిన తర్వాత వాటిని సేకరించి పూజకు ఉపయోగించడం శుభప్రదమని, అదే ఆ పారిజాత దివ్యత్వానికి సరైన మార్గమని పెద్దలు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad