Monday, March 24, 2025
HomeదైవంTirumala: నేడు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

Tirumala: నేడు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల (Angapradakshinam tokens released) కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

- Advertisement -

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌
తిరుమల, తిరుపతిల‌లో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News