Tuesday, April 15, 2025
HomeదైవంAnna Lezhneva: టీటీడీ అన్న‌దానం కేంద్రానికి ప‌వ‌న్ కళ్యాణ్‌ సతీమణి విరాళం

Anna Lezhneva: టీటీడీ అన్న‌దానం కేంద్రానికి ప‌వ‌న్ కళ్యాణ్‌ సతీమణి విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సంగతి తెలిసిందే. వేకువ‌జామున స్వామివారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నారు. ద‌ర్శ‌నం అనంతరం రంగనాయకుల కళ్యాణ మండపంలో అర్చ‌కులు ఆమెకు శ్రీవారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆమె.. తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

ఇవాళ తిరుమలలో తమ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో మ‌ధ్యాహ్నం భోజ‌నానికి రూ. 17ల‌క్ష‌లు విరాళం అందజేశారు. కాగా పవన్-అన్నా దంపతుల కుమారుడు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్‌ ఇటీవ‌ల సింగ‌పూర్‌లోని పాఠ‌శాల‌లో జ‌రిగిన‌ అగ్ని ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News