HomeTop StoriesGajwel: శ్రీ గౌరీ దేవిగా భక్తులకు దర్శనం

Gajwel: శ్రీ గౌరీ దేవిగా భక్తులకు దర్శనం

గజ్వేల్(తెలుగుప్రభ): శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజయిన గురువారం శ్రీ గౌరీ దేవి అలంకరణలో విద్యాధరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ, కుంకుమార్చన, హోమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. వేద పండితులు, భక్తులు కలిసి చేపట్టిన గిరిప్రదక్షిణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడంతోపాటు మహాప్రసాదాన్ని అందజేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News