HomeదైవంJagga Reddy: జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆరుద్రాష్టమి వ్రతం.. హాజరైన జగ్గారెడ్డి

Jagga Reddy: జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆరుద్రాష్టమి వ్రతం.. హాజరైన జగ్గారెడ్డి

సంగారెడ్డి(తెలుగుప్రభ): సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణ లో ఆరుద్రాష్టమి వ్రత క్రతువు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాల్గొన్నారు. అరుద్రాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. 2700 మంది మహిళలతో సామూహిక ఆరుద్రాష్టమి వ్రతాన్ని నిర్వహించారు.

- Advertisement -

కార్యక్రమంలో భాగంగా ఆరుద్రాష్టమి మహత్యం, అమ్మవారి విశిష్టత, పూజా విధానాలను నిర్వాహకులు భక్తులకు వివరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజలతో ఫసల్‌వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగేరి శ్రీహరి, జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News