Ashwin month 2025 festival list: హిందూ క్యాలెండర్ లో అశ్వినీ మాసం ఏడో నెల. దీనినే ఆశ్యయుజ మాసం అని కూడా అంటారు. ఈ పవిత్రమైన మాసం శరత్కాలంలో వస్తుంది. సెప్టెంబరు 7న మెుదలుకానున్న ఈ మాసం.. అక్టోబరు 07 వరకు కొనసాగుతోంది. ఇది శరద్ పూర్ణిమతో ముగుస్తుంది. ఆ తర్వాత నుంచే పవిత్రమైన కార్తీక మాసం మెుదలుకానుంది. అశ్విని మాసం పితృదేవతలను మరియు దుర్గాదేవిని పూజించడానికి చాలా అనువైనదిగా భావిస్తారు. ఈ నెలలోనే పితృపక్ష, నవరాత్రి, దసరా వంటి పండుగలు వస్తాయి.
అశ్వినీ మాసంలో రాబోయే పండుగలు/ఆచారాలు:
**పితృ పక్షం- 8 నుండి 21 సెప్టెంబర్ 2025 వరకు
అశ్వినీ మాసం పితృ పక్షంతో ప్రారంభమవుతుంది, ఇది పూర్వీకులకు నివాళులు అర్పించడానికి సరైన మాసం. పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని శ్రాద్ధం, తర్పణం మరియు పిండ దానం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. ఇది సెప్టెంబర్ 8న మెుదలై.. సెప్టెంబర్ 21న సర్వ పితృ అమావాస్యతో ముగుస్తుంది.
**జీవిత పుత్రిక వ్రతం – 14 సెప్టెంబర్ 2025
అశ్వినీ కృష్ణ పక్ష అష్టమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పిల్లలు దీర్ఘాయుషుతో ఉండాలని తల్లులు ఈ ఉపవాసం చేస్తారు. ఇది సెప్టెంబరు 14న జరుపుకుంటారు.
**ఇందిర ఏకాదశి – 17 సెప్టెంబర్ 2025
కృష్ణ పక్ష ఏకాదశి నాడు వచ్చే ఇందిరా ఏకాదశి అనేది పూర్వీకులను మరణానంతర జీవితంలో బాధల నుండి విముక్తి చేస్తుందని నమ్మే ముఖ్యమైన వ్రతం. ఈ సంవత్సరం, దీనిని బుధవారం, 17 సెప్టెంబర్ 2025 నాడు రాబోతుంది.
**సర్వ పితృ అమావాస్య – 21 సెప్టెంబర్ 2025
పితృ పక్షంలో చివరి రోజు మరియు అతి ముఖ్యమైన రోజు. పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేయడానికి ఇది మంచి రోజు. ఈ ఏడాది ఇది సెప్టెంబర్ 21న వస్తుంది.
**నవరాత్రి – 22 సెప్టెంబర్ 2025
శారదీయ నవరాత్రులు సెప్టెంబరు 22న మెుదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఉండే ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకం. నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు.
Also Read: Next Eclipse 2025-తర్వాత గ్రహణం ఎప్పుడు? అది ఇండియాలో కనిపిస్తుందా?
**సరస్వతి ఆవాహనం – 29 సెప్టెంబర్ 2025
నవరాత్రి సమయంలో నాలుగు రోజుల సరస్వతి పూజలో మొదటి రోజున, భక్తులు సరస్వతి ఆవాహం చేస్తారు. ఇది 29 సెప్టెంబర్ 2025న వస్తుంది.
**దుర్గాష్టమి – 30 సెప్టెంబర్ 2025
నవరాత్రిలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటైన దుర్గాష్టమి సెప్టెంబర్ 30న రాబోతుంది.
**మహా నవమి – 1 అక్టోబర్ 2025
నవరాత్రి చివరి రోజు మహా నవమి. ఇది దుర్గాదేవి మహిషాసురుడిపై విజయాన్ని సూచిస్తుంది.
**దసరా (విజయదశమి) – 2 అక్టోబర్ 2025
చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకునేది దసరా. 2025లో, విజయదశమి అక్టోబర్ 2న వస్తుంది.
**పాపాంకుశ ఏకాదశి – 3 అక్టోబర్ 2025
2025 లో, పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 3 న వస్తుంది. అన్ని పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
**శరద్ పూర్ణిమ – 6 అక్టోబర్ 2025
అశ్వినీ మాసం శరద్ పూర్ణిమతో ముగిస్తుంది. ఈ ఏడాది దీనిని అక్టోబర్ 6న జరుపుకుంటారు.
Also Read: Neem Plant -వేప చెట్టు ఈ దిశలో నాటితే.. ఆ దోషాలు తొలగిపోతాయి..


