Astrological impact of Surya Grahan 2025: గ్రహణం అనగానే అంతా బయపడిపోతుంటారు. గుడి, గోపురాలు మూసివేసి గ్రహణం వీడిన అనంతరం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి తెరుస్తారు. అంతేకాదు, గ్రహణం సమయంలో జనం బయటికి రావడానికి జంకుతారు. అందుకే, గ్రహణం రాబోతుందంటే జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతుంటారు. ఈనెల 7న చంద్రగ్రహణం పలుకరిచంగా.. మరో గ్రహణం సంభవించబోతోంది. ఈనెల 7న సంభవించిన చంద్రగ్రహణానికి కొనసాగింపుగా ఈనెల 21న సూర్య గ్రహణం రాబోతోంది. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం భద్రప్రద మాసం కృష్ణ పక్షం అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ 21, 2025న ఏర్పడనుంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేయడాన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఇది ఖగోళ శాస్త్రంలోని ఒక ముఖ్యమైన దృగ్విషయంగా చెబుతారు. అయితే, కన్య రాశి, ఉత్తర ఫగుణి నక్షత్రంలో సంభవించే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, దీని ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి సమస్యలు పెరగవచ్చు. అదే సమయంలో, ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులపై కూడా ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆయా రాశుల వారు సూర్య గ్రహణం ప్రభావంతో ఆరు నెలల పాటు కష్టాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి వారిపై సూర్య గ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది. వారు చేసే పనిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే, వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. బిజినెస్‌లో నష్టం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారు సూర్య గ్రహణం రోజు కొత్త పనిని అస్సలు ప్రారంభించవద్దు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కళా రంగంలో ఉన్నట్లైతే వారికి రివార్డుతో పాటు రిస్కు కూడా అంతే ఉంటుంది.
కన్య రాశి
ఈ రాశి వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తమ ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించరాదు. పని, ప్రత్యేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో డబ్బు కోల్పోవడం వల్ల ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఓపిక, ధైర్యంతో ఎదుర్కునే నైపుణ్యం వీరికి ఉంటుంది. ఈ రాశి వారు అస్సలు అప్పులు చేయవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ గ్రహణం సమయంలో అప్పులు చేస్తే వాటిని తీర్చడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఆఫీసులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, సమస్యలకు భయపడకుండా.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ భావజాలంతో సరిపడే కొత్త వ్యక్తులను కలుస్తారు. కానీ పని ప్రదేశంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన కొన్ని పాత వ్యాధులు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.


