Dev Diwali 2025 Horoscope: దీపావళి పండుగ జరిగిన పక్షం రోజులకు అంటే కార్తీక పౌర్ణమి నాడు దేవ్ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేవ్ దీపావళిని నవంబర్ 05న జరుపుకోనున్నారు. ఈరోజున కొన్ని అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి.
ఈరోజున శని మీనరాశిలో వ్యతిరేక రాజయోగాన్ని సృష్టిస్తుంటే.. బృహస్పతి హన్స్ రాజయోగంలో ఉంటాడు. శుక్రుడు తన సొంత రాశిలో మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తుంటే..కుంభరాశిలో రాహు నవపంచమ యోగాన్ని సృష్టిస్తున్నాడు. వృశ్చిక రాశిలో ఉన్న కుజుడు కూడా కేంద్రత్రికోణ రాజయోగాన్ని, సూర్యుడు శుక్రుడితో కలిసి శుక్రాదిత్య యోగాన్ని రూపొందిస్తున్నాడు. ఇదే రోజున సర్వార్ద సిద్ధి, అమృత యోగం కూడా రూపొందుతున్నాయి. ఈ శక్తివంతమైన యోగాల వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
మేష రాశి
మేష రాశి వారికి దేవ్ దీపావళి అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం ఉంటుంది. లగ్జరీ సౌకర్యాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో గెలుస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతోంది. పూర్వీకుల ఆస్తిపై కొనసాగుతున్న వివాదం ముగుస్తుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది.
కర్కాటక రాశి
దేవ్ దీపావళి రోజు కర్కాటక రాశి వారి అదృష్టం ప్రకాశించనుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం, ఆస్తి, ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Astrology -2026లో ఈ 3 రాశులకు శనిదేవుడి కటాక్షం.. డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
వృశ్చిక రాశి
దేవ్ దీపావళి వృశ్చిక రాశి వారికి స్పెషల్ కాబోతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు ప్రతి పనిలో లక్ సపోర్టు చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనే మీ కోరిక నెరవేరుతోంది. మత సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. జీవితంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది.


