Diwali Vastu: దీపావళి పండుగ అంటేనే శుభం,వెలుగులకు సూచన. ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో ధనం, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. కానీ పండుగ నాడు కొన్ని చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలకి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు.పండుగ సమయంలో ధనం ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుంటే చాలా మంచిది.
బీరువా లేదా డబ్బుల పెట్టె..
పండితులు చెబుతున్న వాస్తు నియమాల ప్రకారం, బీరువా లేదా డబ్బుల పెట్టెలను సరైన దిశలో ఉంచితే ఇంట్లో ధన స్థిరత్వానికి సహాయపడుతుంది. కానీ, కొందరు తెలియక పొరపాటున తప్పు ప్రదేశంలో డబ్బును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని పండితులు వివరిస్తున్నారు. దీపావళి రోజున ముఖ్యంగా మూడు ప్రదేశాల్లో ధనం ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/jupiter-transit-brings-luck-for-taurus-leo-and-aquarius/
బాత్రూమ్ సమీపంలో బీరువా లేదా డబ్బు పెట్టె అస్సలు పెట్టకూడదు. ఆ ప్రదేశం తడిగా ఉండడం వల్ల, నెగటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉండే ప్రాంతంగా పండితులు వివరిస్తున్నారు. అలాంటి ప్రదేశంలో డబ్బును ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, దురదృష్టం వెంటాడవచ్చని రావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా, ఇలాంటి ప్రదేశాల్లో ఉంచిన డబ్బు ఎక్కువ రోజులు నిల్వ ఉండదని అంటున్నారు.
విరిగిన లేదా పగిలిన వస్తువులు..
ఇదిలా ఉంటే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. విరిగిన లేదా పగిలిన వస్తువుల దగ్గర బీరువా పెట్టకూడదు.. బీరువా చుట్టూ పగిలిన గాజు వస్తువులు, విరిగిన బొమ్మలు, పాత బాక్సులు ఉంటే వాటిని తొలగించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి అశుభ సూచకాలుగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో ఆర్థిక అభివృద్ధి మందగిస్తుందని చెబుతారు. దీపావళికి ముందు బీరువా చుట్టూ ఉన్న అన్ని వస్తువులను శుభ్రం చేయడం చాలా శ్రేయస్కరం.
బహుమతులైన వెండి నాణేలు, గడియారాలు…
ఇతరులిచ్చిన బహుమతులైన వెండి నాణేలు, గడియారాలు, బాక్సులు మొదలైనవాటిని ధనంతో కలిపి ఉంచకూడదు. ఈ బహుమతులు మంచి ఉద్దేశంతో ఇచ్చినవే అయినప్పటికీ, వాటిని బీరువాలోని డబ్బుతో కలిపి ఉంచడం వాస్తు ప్రకారం మంచిదికాదని చెబుతారు. వాటిని వేరే ప్లేస్ లో ఉంచడం శుభప్రదం.
బీరువాను శుభ్రం చేయడం..
దీపావళి ముందు బీరువాను శుభ్రం చేయడం ఎంతో ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ధనం ఉంచే ప్రదేశం శుభ్రంగా, వెలుగుతో ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, పాత కాగితాలు, పగిలిన వస్తువులు బీరువాలో లేదా దాని చుట్టూ ఉండకూడదు. ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గించే అంశాలుగా పండితులు వివరిస్తున్నారు.
ఉత్తర దిశలో…
అదేవిధంగా, వాస్తు ప్రకారం బీరువాను ఉత్తర దిశలో ఉంచడం అత్యంత శుభప్రదం. ఉత్తరం దిశను ధనదేవుడు కుబేరుడి దిశగా చెబుతారు. ఈ దిశలో బీరువా ఉంచడం వల్ల ఇంట్లో ధనం నిల్వగా ఉండటమే కాకుండా, ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుందని చెబుతారు. ఈ కారణంగా చాలామంది తమ ఇంట్లోని ధనాన్ని ఉత్తర దిశను ఎదురుగా ఉంచిన బీరువాలోనే ఉంచడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
దీపావళి రోజున మరికొన్ని విషయాలు జాగ్రత్తగా పాటిస్తే అదృష్టం మరింత పెరుగుతుందని కూడా చెబుతారు. ఉదాహరణకు, దీపావళి రాత్రి ఇంటి ప్రతి మూలలో వెలుగు ఉండేలా దీపాలు వెలిగించడం, ప్రధాన తలుపు వద్ద వెలుగులు ఉంచడం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు. బీరువా సమీపంలో చిన్న దీపం వెలిగించి ఉంచడం కూడా వాస్తు పరంగా శుభప్రదం.
ధనం ఉంచే ప్రదేశంలో ఎప్పుడూ శుభత వాతావరణం ఉండాలి. ఆ ప్రాంతంలో చెదలు, దోమలు, దుమ్ము ఉండకూడదు. బీరువాలో కుబేరుడి చిత్రం లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంచడం సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.


