దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నేత్రపర్వంగా దీపోత్సవం నిర్వహించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు.
అంతకుముందు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారులు కొలువుదీరిన రథాన్ని లాగారు. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించారు.
ఈ కార్యక్రమం అనేక గిన్నిస్ రికార్డులు నెలకొల్పనుంది. వేడుకల సందర్భంగా సుమారు 10వేల మంది భద్రతా సిబ్బంది అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహించారు. లేజర్, డ్రోన్ షోలు సహా మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేసియా, భారతీయ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇవి ఆహుతులను ఆకట్టుకున్నాయి.