Benefits of Bamboo Plant for Vastu: మనదేశంలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇంటి నిర్మాణం చేయాలన్నా, ఏదైనా కట్టడం కట్టాలన్నా వాస్తు బాగుందా లేదా అని చూస్తారు. అయితే వాస్తు ప్రకారం, కొన్ని చెట్లు ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి వాటిలో వెదురు మెుక్క ఒకటి. దీని వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి..సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా మీ జీవితం సుఖమయం అవుతుంది. అయితే వెదురు మెుక్కను ఏ దిశలో పెట్టడం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
ఏ దిశలో ఉంచాలంటే?
వెదురు మెుక్క ఇంట్లో ఉండటం మంచిదంటారు. అయితే ఇది అంత తొందరగా పెరగదు. భూమిలో పాతిపెట్టిన కొంత కాలం తర్వాత ఒక్కసారిగా ఎదుగుకు వస్తుంది. వెదురు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. వీరి సిరి సంపదలకు లోటు ఉందదు. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. వెదురు మెుక్కను తూర్పు దిశలో లేదా ఆగ్నేయ దిశలో పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యకాంతి పడిన చోట పెడితో అన్ని విధాలు బాగుంటుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీరు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు.
Also Read: August Rashiphalalu- ఆగస్టులో నక్క తోక తొక్కబోతున్న రాశులు ఇవే!
ఈ పొరపాట్లు చేయెుద్దు..
అయితే వెదురు మెుక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్ రూమ్ లో పెట్టకండి. వీలైనంత వరకు లివింగ్ రూమ్ లో లేదా స్టడీ రూమ్ లో ఉంచుకోండి. పని చేసే చోట వెదురు మెుక్కను ఉంచడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఈ చెట్టు గాలిని కూడా శుద్ధి చేస్తుంది. మెుత్తానికి వెదురు మీ జీవితంలో ప్రశాంతతను, శాంతిని తీసుకొస్తుంది.
Disclaimer: పై కథనంలో వాస్తు నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇవ్వడమైనది. వీటిని పాటించే ముందు మీకు తెలిసిన వాస్తు నిపుణుడి సలహా తీసుకోండి. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


