కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చిన మహా ఋషి భగీరథ మహర్షి అని బనగానపల్లె నియోజకవర్గ సగర (ఉప్పర) సేవా సంఘం అధ్యక్షులు బుర్రా వెంకటేశ్వర్లు అన్నారు. వైశాఖ శుద్ధ సప్తమి రోజైన మంగళవారం శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు బనగానపల్లె పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు ఆవిష్కరించిన భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి మనవడు అయిన భగీరథ మహర్షి తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చాడని అన్నారు.
భగీరథుడు మహా జ్ఞాని అని, పరోపకారానికి పెట్టింది పేరు అని అన్నారు. దీక్షకు, సహనానికి ప్రతిరూపమని అన్నారు. అందుకే ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారని అన్నారు. అంతటి జ్ఞాని సగర కులంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు. సగరులంతా ఐక్యంగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని అన్నారు.
కార్యక్రమంలో సగర సేవా సంఘం నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు, ఉప్పరి సుబ్బారావు, చిందుకూరి సుబ్రహ్మణ్యం, పోలూరు కృష్ణ, నీరుకట్టు చెన్నయ్య, చిందుకూరి సురేష్, లక్ష్మీనారాయణ, అంగడి కృష్ణ, నీరుకట్టు దస్తగిరి, శ్రీరాములు, రిటైర్డ్ ఎస్ ఐ పుల్లయ్య, కంటెల చెంచయ్య, మధుమోహన కృష్ణ, చిందుకూరి నాగరాజు, తులసీశ్వర్, వర్ర మద్దిలేటి, చంద్ర, పోతుగంటి కృష్ణ, వర్ర వెంకటరాముడు, విలేకరి సాగర్, సగర బంధువులు పాల్గొన్నారు.