Thursday, April 10, 2025
HomeదైవంBanaganapalli: బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ చౌడేశ్వరి దేవి

Banaganapalli: బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ చౌడేశ్వరి దేవి

చండీ పారాయణ..

బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం నందు దేవి శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శుక్రవారం అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రాతః కాలం నందే మేల్కొలుపు చేసి అభిషేక, నిత్యార్చన విశేష పూజా క్రతువులు నిర్వహించి యాగశాల నందు ఆలయ వేద పండితుల, అర్చకులు ఆద్వర్యంలో ఆవాహిత దేవతా పూజలు చండీ పారాయణ నిర్వహించారు.

- Advertisement -

ఆలయ అసిస్టంట్ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారిణి జి కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకి ఎటువంటి ఇబ్బందీ లేకుండా పర్యవేక్షించారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని కొండపేట అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే కూరగాయల మార్కెట్లో అమ్మవారి విగ్రహం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు. కాలేజీ గ్రౌండ్ సమీపంలో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News