Saturday, September 28, 2024
HomeదైవంBanaganapalli: స్వాతి నక్షత్ర పూజలు

Banaganapalli: స్వాతి నక్షత్ర పూజలు

రెండు రోజుల పూజలు

బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండ సమీపంలో ఉన్న చెంచులక్ష్మి సమేత పావన నరసింహ స్వామి దేవస్థానం నందు మంగళ, బుధవారాలలో స్వాతి నక్షత్ర పూజలు, నరసింహ జయంతి నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వహిందూ పరిషత్ ప్రచారకులు, ప్రధాన అర్చకులు బాలిశెట్టి పావన నరసింహమూర్తి సోమవారం తెలిపారు.

- Advertisement -

ప్రతి 27 రోజులకు ఒకసారి స్వాతి నక్షత్ర పూజలు జరుగుతాయని, ఈసారి స్వాతి నక్షత్రం మరుసటి రోజు నరసింహ జయంతి వచ్చిందని తెలిపారు. మంగళవారం, బుధవారం నరసింహ జయంతి రెండు రోజులు దేవస్థానము నందు తులసీదళాలతో అర్చనలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని, భక్తులు ఈ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News