నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి శివదీక్ష మాలధారణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
యాగంటి శివ మాల దీక్ష ప్రారంభించిన కాటసాని
నంద్యాల జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల రెడ్డి ఉదయాన్నే దేవస్థానం చేరుకొని శివదీక్ష స్వీకరించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల దీక్ష (41 రోజులు) పాటించి మహా శివరాత్రికి దీక్ష విరమిస్తారు. స్వతహాగా శివ భక్తుడైన కాటసాని 1991లో తానే స్వయంగా యాగంటి శివమాల దీక్షను ప్రారంభించి అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మాలధారణ చేపట్టి గత 34 ఏళ్లుగా ఈ దీక్ష పాటిస్తూ వస్తున్నారు. సతీసమేతంగా యాగంటి క్షేత్రానికి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శివదీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమంలో యాగంటి దేవస్థానం ఈవో బి చంద్రుడు, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానసత్రం ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, కోశాధికారి వై రామారెడ్డి, పాతపాడు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన పూజారి మహేశ్ శర్మ, దేవేంద్ర శర్మ, లోకనాథ శర్మ, రాఘవేంద్ర శర్మ సత్యనారాయణ శర్మలు పాల్గొన్నారు.