జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 331వ ఆరాధన మహోత్సవాలు బనగానపల్లె పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెలో నడయాడి అచ్చమాఃబ ఇంట గోవుల కాపరిగా ఉండి రవ్వలకొండపై కాలజ్ఞానం రచించారు. కాలజ్ఞాన ప్రతులను గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంట నిక్షిప్తం చేసిన బ్రహ్మంగారి ప్రధమ పీఠం బనగానపల్లె. అచ్చమాంబ చింతమాను మఠంలో, వీరప్పయ్య ఆశ్రమంలో, నేలమఠంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఆరాధన మహోత్సవాల్లో భాగంగా 17వ తేదీ నుండి శుక్రవారం వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామి వారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్రమైన రోజు వారికి పంచామృతాభిషేకాలు, పల్లకి సేవ, మహాప్రసాద వితరణ గావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.18వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు గ్రామోత్సవం, 19వ తేదీ ఆదివారం మహా నివేదన కార్యక్రమంతో ఆరాధన మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.