Friday, October 4, 2024
HomeదైవంBasara: బ్రహ్మచారిణి అవతారంలో బాసర సరస్వతీ దేవి

Basara: బ్రహ్మచారిణి అవతారంలో బాసర సరస్వతీ దేవి

శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో..

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనం ఇచ్చారు.

- Advertisement -

ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. శరన్నవరాత్రుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News