HomeదైవంBasara Navaratri Celebrations: బాసర నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Basara Navaratri Celebrations: బాసర నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

  • బాసర నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
  • 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి వేడుకలు
  • 16న మూలా నక్షత్రం సందర్భంగా అక్షర శ్రీకర పూజలు
  • ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు: ఈవో అంజనీ దేవి

ముథోల్, అక్టోబర్‌ 5 (తెలుగు ప్రభ): చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

- Advertisement -

తొమ్మిది రూపాల్లో అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాటక్‌, ప్రధానార్చకులు సంజీవ్‌ పూజారి తెలిపారు. అక్టోబర్‌ 11న తొలి రోజు శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కూష్మాండ, 15న స్కందమాత, 16న కాత్యాయని, 17న కాళరాత్రి, 18న మహాగౌరి, 19న సిద్ధిదాత్రి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

16న మూలా నక్షత్రం.. అక్షర శ్రీకర పూజలు

ఈ నెల 16న అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అక్షర శ్రీకర పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ పూజలు నిర్వహిస్తే చిన్నారులు విద్యాభివృద్ధి సాధిస్తారనే భక్తుల విశ్వాసం ఉందన్నారు. అక్షర స్వీకార పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

ప్రత్యేక పూజలు.. నైవేద్యాలు

నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులపాటు ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నట్లు తెలిపారు.

ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు

ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఈవో అంజనీ దేవి తెలిపారు. మండపాలు అందుబాటులో లేకపోవడంతో పాటు అభివృద్ధి పనుల కారణంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పలు సేవలను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్లు శివరాజ్‌, సంజీవరావు, ఆలయ పీఆర్వో నారాయణ పటేల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News