బీర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం నిత్య హోమము, బలిహరణము నిర్వహించి, స్వామి వారికి చందనోత్సవ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని చందనంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు డోలోత్సవము, తెప్పోత్సవముల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వొద్దిపర్తి సంతోషాచార్యులు, మధుకుమారాచార్యులు, చిన్న సంతోషచార్యులు, ఆలయ అధికారులు, భక్తులు, మాజి చైర్మన్లు సుమన్ సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/64bd6054-5907-42e2-b5ca-1d05f7f632e4-1022x1024.jpg)
పార్వేటకు ఏర్పాట్లు
బీర్ పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం 3 గంటలకు పారేట్ ఉత్సవము (వేట) కార్యక్రమ ఘట్టాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసాము ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలియజేశారు.