Saturday, November 15, 2025
Homeదైవంbest companion: నీజీవిత సహచరి ఎవరు?

best companion: నీజీవిత సహచరి ఎవరు?

అమ్మనా ? నాన్ననా ? భార్యనా ? -భర్తనా ? కొడుకా ?కూతురా? -స్నేహితులా బంధువులా లేదు. నీసహచరి ఎవరు.. ఎవరూ..కాదు! నీనిజమైన సహచరి ఎవరో తెలుసా‌ ? నీ శరీరమే! ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు‌ ! నువ్వు అవునన్నా..? కాదన్నా ? ఇది కఠిక నిజం. నీవూ నీ శరీరం మాత్రమే జననంనుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవేదైతే నీశరీరం కొరకు బాధ్యతగా ఏపనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో, నీశరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి? నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి ?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి ?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి గుర్తించుకో ! నీ శరీరమొక్కటే నీవు, జీవిస్తున్న చిరునామా..? నీశరీరమే నీ ఆస్థి, సంపద వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు. నీశరీరం నీబాధ్యత ఎందుకంటే ? నీవే నిజమైన సహచరివి !కనుక జాగ్రత్తగా ఉండు. నీగురించి నువ్వు జాగ్రత్త తీసుకో డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు,స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో! నీశరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప ! ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు,ప్రపంచానికి మంచి పనులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad