Auspicious Days To Cut Nails: జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రకారం మనం చేసే పనులు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్ని గ్రహాల కదలికలు, వాటి స్థానాల వల్ల ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. అందులో గోళ్ళు కత్తిరించడం ఒకటి. గోళ్ళు కత్తిరించడం అనేది ఒక వ్యక్తి పరిశుభ్రత చర్యలో భాగం. అయితే జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం కొన్ని రోజుల్లో గోళ్ళు కత్తిరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తున్నారు. ఇతర రోజుల్లో కత్తిరించడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యం చెబుతుంది. మరి ఏ రోజు గోళ్ళు కత్తిరించవచ్చు? ఏ రోజులలో కత్తిరించడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అనుకూలమైన రోజులు:
జ్యోతిష్య శాస్త్రా ప్రకారం, కొన్ని రోజులను శుభప్రదంగా భావిస్తారు. అందులో బుధవారం ఒకటి. దీనికి అధికపతి బుధుడు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం వల్ల జ్ఞానం, వ్యాపారంలో లాభాలు, తెలివితేటలు మెరుగుపడుతాయని జ్యోతిష్య నిపుణులు నమ్ముతారు. గురువారంలో బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి దీని బృహస్పతి వారం అని కూడా పిలుస్తారు. గోళ్ళను గురువారంలో కత్తిరించడం వల్ల ఆధ్యాత్మికత, సంపద లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ సమయంలో గోళ్ళను కత్తిరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని కూడా కొందరు నమ్ముతారు. చివరిగా అదివారం రోజున సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఆదివారం గోళ్ళను కత్తిరించడం వల్ల ఆత్మవిశ్వాసం, సానుకూల శక్తి లభిస్తుందని కొందరు జ్యోతిష్యులు సూచిస్తారు.
అనుకూలం కాని రోజులు:
గోళ్ళు ఈ రోజులలో కత్తిరించడం అశుభకరమని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తుంది. అందులో శనివారం ఈ వారం శనిదేవుడికి ఇష్టమైన వారం. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం వల్ల ఆర్థిక నష్టాలు, అనారోగ్యసమస్యలు, దురదృష్టం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గోళ్ళు మాత్రమే కాకుండా జుట్టును కూడా కత్తిరించకూడదు. మంగళవారం కూడా అశుభవారంగా భావిస్తారు. ఈ వారంలో గోళ్ళు కత్తిరించడం వల్ల అప్పులు పెరగడం, ప్రమాదాలు సంభవించడం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే సోమవారం చంద్రుడికి సంబంధించినది కాబట్టి ఈ వారంలో కూడా గోళ్ళు కత్తిరించకూడదు. ఈరోజు కత్తిరించడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
గోళ్ళు కత్తిరించడాని ఏ రోజు అనుకూలమైనది అనేది ఒకరి వ్యక్తిగత నమ్మకం. జ్యోతిష్యం నమ్మేవారు పైన తెలిపిన సూచనలు పాటించడం వల్ల అదృష్టాన్ని, శ్రేయస్సుపొందుతారు.
గమనిక: పైన తెలిపిన సమాచారంలో ఏదైనా సందేహాలు ఉంటే మీరు అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించవచ్చు.