Saturday, November 23, 2024
HomeదైవంBethamcharla: ప్రముఖ శైవ క్షేత్రం ముచ్చట్ల క్షేత్రం

Bethamcharla: ప్రముఖ శైవ క్షేత్రం ముచ్చట్ల క్షేత్రం

ముక్కోటి దేవతలు ముచ్చటించుకునేది ఇక్కడే

బేతంచెర్ల నుండి డోన్ రహదారిలో బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల గ్రామ పరిధిలో బేతంచెర్ల నుండి డోన్ రహదారిలో హెచ్. కొట్టాల స్టేజి దగ్గర నుండి 3 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న అతిపురాతన శైవ పుణ్య క్షేత్రం ముచ్చట్ల క్షేత్రం. కోటి దేవతలు భువి నుండి దివికి దిగివచ్చి, ఎత్తయిన కొండకోనల నడుమ, లోతైన లోయలో పచ్చని బయళ్లతో జలజల పారే సెలయేరులో స్నానాలు ఆచరించి, ముక్కోటి దేవతలు ముచ్చటించుకున్న ఈ ప్రాంతమునే ముచ్చట్ల క్షేత్రం అని అంటారు. ఈ శివాలయంలో భ్రమరాంభ సమేతంగా శ్రీ మల్లిఖార్జునుడు నిత్యం పూజాలంటు కుంటున్నారు. విజయ దశమిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన నంబూరి తిలక్ కుమార్ నాయుడు, శ్రావణి దంపతులు స్వామి వారికి 250 గ్రాముల వెండి ఆభరణం బహుకరించారు. ముచ్చట్ల క్షేత్రం అర్చకులు చంద్రశేఖర్ కు అందజేయగా స్వామికి ఈ ఆభరణాలు అలంకరించారు. అర్చకులు చంద్రశేఖర్, దాతలగు తిలక్ కుమార్ నాయుడు శ్రావణి దంపతులకు వారి బంధు మిత్రులకు స్వామిఅమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పుజాలు నిర్వహించి తీర్థ ప్రసాదములు వారికి అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News