నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పొలిమేరలో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 10 వతేది శుక్రవారం నాడు, ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుండి, శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ధ్రువమూర్తికి మహాస్నపన తిరు మంజనం, చందనాలంకారణ సేవ, విశేష పుష్పాలంకరణ జరుగును. తదుపరి 4 గంటల 30 నిమిషముల నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు వేంచేపు, ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనము ఉదయం 10 గంటల నుండి కళ్యాణ వేదిక వరకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగును. అనంతరం అభిజిత్ లగ్న శుభ పుష్కరాంశమందు, శ్రీ భూ- నీలా సమేత ఘణ మద్దిలేటి నరసింహ స్వామి వార్ల, శాంతి కళ్యాణ మహోత్సవము నీ రాజనము, తీర్థ ప్రసాద వినియోగము జరుగును.
సాయంత్రం 4 గంటల నుండి ఆర్ ఎస్.రంగాపురం పురవీధుల గుండా, అలంకరణలతో, విధ్యుత్ కాంతుల శోభతో, వివిధ మంగళ వాయిద్యాల నడుమ, చెక్క భజనలు, కోలన్న దళాలతో వివిధ వేషాధారణల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథం నందు, శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవంను నిర్వహిస్తారు. 11వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి చతుస్థానార్చన, బలిహారణ, మహా పూర్ణాహుతి, మహా కుంభ ప్రోక్షణ అనంతరం ముక్కోటి ఏకాదశి మహోత్సవంలో ముఖ్య ఘట్టము చక్రస్నానము ఉదయం 10 గంటల నుండి మద్దిలేరు వాగు కోనేరు నందు నిర్వహించబడును.
సాయంత్రం 5:30 నుండి మద్దిలేటీ వాగు కోనేరు నందు, అత్యంత రమణీయంగా, విద్యుత్ కాంతుల శోభతో, వివిధ అలంకరణలతో, శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవము కన్నుల పండువగా, భక్తులు, అధికారులు, వేద పండితులు, అర్చక పరివారంతో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవములలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు ఆగుదురని ఉప కమిషనర్ శ్రీ మద్ధిలేటీ దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం రామాంజనేయులు తెలిపారు.