Bhadra Mahapurusha Raja Yogam Effect On Zodiacs: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు రాశిచక్రాలను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి ఇతర గ్రహాలతో కలిసి అద్భుతమైన రాజయోగాలను ఏర్పరుస్తాయి. ఇలాంటి శక్తివంతమైన రాజయోగమే 800 ఏళ్ల తర్వాత ఏర్పడబోతుంది. అదే భద్ర పురుష మహా రాజయోగం. ఈ శుభప్రదమైన యోగం కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం జూలై నెలలో ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్య రాశి
ఎనిమిది శతాబ్దాల తర్వాత ఏర్పడబోతున్న ఈ అరుదైన యోగం కారణంగా కన్య రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. వీరు కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి ఇంతక ముందు కంటే బాగుంటుంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశం ఉంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది.
సింహా రాశి
భధ్ర పురుష మహా రాజయోగంతో సింహరాశి వారు జూలైలో శుభవార్త వింటారు. వీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వ్యాపారులకు భారీగా లాభాలు ఉండటంతో.. బిజినెస్ ను విస్తరిస్తారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీరు ఆర్థికంగా ఊహించని స్థాయికి ఎదుగుతారు. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహాయోగం ఉంది.
మిథున రాశి
భద్ర పురుష రాజయోగం మిథతునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి. మీకు నచ్చిన వ్యక్తితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. సంపద భారీగా వృద్ధి చెందుతుంది. మీరు అనారోగ్యం నుండి కోలుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి భద్ర పురుష మహా రాజయోగం శుభకరంగా ఉండనుంది. డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ జీవితం కొత్త పుంతలు తొక్కుతోంది. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పని చేసే చోట పై అధికారుల మద్దతు మీకు లభస్తుంది. దాంపత్య జీవితంలోని గొడవలన్నీ తొలగిపోయి..వారిద్దరి బంధం మరింత గట్టిపడుతుంది. కోరుకున్న చోట పోస్టింగ్ దొరుకుతుంది.