Bharat Gaurav train: ఇది సాధారణ ట్రావెల్ కాదు… ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. తూర్పు భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రాలను ఒక్క ప్రయాణంలో దర్శించే అరుదైన అవకాశం. అదే భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్. ఈ యాత్ర మొత్తం 09 రాత్రులు 10 రోజులు ప్రారంభం ఢిల్లీ నుంచి ప్రయాణ తేదీ 09.03.2026. ఒక్క వ్యక్తికి ప్యాకేజీ ధర కేవలం రూ.79,285 నుంచే మొదలవుతుంది. ఈ ప్రత్యేక యాత్రను రూపొందించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (Indian Railway Catering and Tourism Corporation) అంటే ఐఆర్‌సీటీస భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ప్రయాణం నుంచి వసతి వరకు, భోజనం నుంచి సైట్ సీయింగ్ వరకు అన్నీ వాళ్లే చూసుకుంటారు.
మొదలయ్యేది ఎక్కడి నుంచి అంటే..
ఈ పవిత్ర ప్రయాణం మొదలయ్యేది కాశీగా ప్రసిద్ధి చెందిన వారణాసి (Varanasi)లో గంగా ఘాట్లు, గంగా ఆరతి, పురాతన ఆలయాల మౌన వాతావరణం మనసును పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి తర్వాత గంగా సముద్రంలో కలిసే పవిత్ర తీరం గంగాసాగర్ (Gangasagar). అనంతరం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata). అక్కడి నుంచి ఒడిశాలోని పూరి (Puri) జగన్నాథ స్వామి దర్శనం… తర్వాత భువనేశ్వర్ (Bhubaneswar), ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం (Konark Sun Temple) రాతిలో చెక్కిన శిల్పాలు చూసినవాళ్లకు మాటలు రావు.
Read Also: Hair fall tips: వేడి నీళ్లా.. చల్లని నీళ్లా? జుట్టు రాలకుండా ఉండాలంటే ఏది బెస్ట్?
భోజనం, వసతి ఎలా అంటే..
ఆలయ దర్శనాలతో పాటు ప్రకృతి అద్భుతం కూడా ఈ టూర్‌లో భాగం… ఆసియాలోనే అతిపెద్ద లగూన్‌గా పేరున్న చిలికా సరస్సు (Chilika Lake) వద్ద పడవ ప్రయాణం, వలస పక్షుల సందడి మనసుకు అసలైన రిలీఫ్… చివరగా శివ భక్తుల మహా పుణ్యక్షేత్రం బైద్యనాథ్ ధామ్ (Baidyanath Dham)… జ్యోతిర్లింగ దర్శనంతో ఈ దివ్య ప్రయాణానికి సంపూర్ణత… ఇక ట్రైన్ విషయానికి వస్తే డీలక్స్ ఏసీ కోచ్‌లు, కంఫర్టబుల్ బెడ్స్, ట్రైన్‌లోనే రెస్టారెంట్ తరహా భోజనం, ప్రతి ప్రాంతంలో లోకల్ గైడ్ సపోర్ట్, ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్, ఎంపిక చేసిన హోటళ్లలో బస… ఇవన్నీ ప్యాకేజీలోనే…
బుకింగ్ -సీట్లు రిజర్వ్ చేసుకోవాలంటే
ఐఆర్‌సీటీసీ అధికారిక నంబర్లకు కాల్ లేదా మెసేజ్ చేయవచ్చు. ఇందుకోసం 8598931047, 8287930484, 8287930032, 8287930299, 8882826357 నంబర్లలో ఏదైనా ఒకదానికి సంప్రదిస్తే పూర్తి ప్యాకేజీ వివరాలు, అందుబాటులో ఉన్న సీట్లు, బుకింగ్ ప్రాసెస్ గురించి క్లియర్‌గా సమాచారం ఇస్తారు. బుకింగ్ చేయాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజీ కోడ్ CDBG37 ఎంటర్ చేయాలి… సీట్లు చాలా పరిమితం. ఆలస్యం చేస్తే మంచి అవకాశం చేజారిపోతుంది. గంగా ఘాట్ల నుంచి జగన్నాథ ఆలయం వరకు, కోణార్క్ శిల్పాల నుంచి చిలికా సరస్సు ప్రశాంతత వరకు… ఒక్క ప్రయాణంలో ఇన్ని మహా పుణ్యక్షేత్రాలు అంటే ఇది నిజంగా భక్తులకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్.

