Tuesday, September 17, 2024
HomeదైవంBhogi: పిల్లలకు బోగి పళ్లెందుకు పోయాలి? భోగి మంటలతో ఆరోగ్యమా?

Bhogi: పిల్లలకు బోగి పళ్లెందుకు పోయాలి? భోగి మంటలతో ఆరోగ్యమా?

సంక్రాంతి పండుగంటేనే రైతుల పండుగ. కాబట్టి పల్లెలలకు వెళ్లాలి..అలా వెళ్లలేకపోతేనేం కాంక్రీట్ జంగిల్ అయిన సిటీల్లో, టౌన్లలో ఈ పండుగను మనం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. పల్లెబాట పడితే సంక్రాంతి పండుగ ఏకంగా 4 రోజులు జరుపుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రమణాన్ని దేశ ప్రజలంతా వివిధ పేర్లతో జరుపుకుంటారు. తెలుగువాళ్లు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు.

- Advertisement -

విలేజ్ ఒలింపిక్స్

ఎడ్లపూజలు, కోడి-ఎడ్ల పందాలు, జాతరలు, విలేజ్ ఒలింపిక్స్ ను పోలిన రకరకాల పోటీలు. ఎన్నని చెప్పాలి సంక్రాంతి హైలైట్స్అన్నీమాటల్లో చెప్పటం అసాధ్యం. నాటు మాంసం, వేట మాంసం, సంప్రదాయ వంటలు.

ఉత్తరాయణ పుణ్యకాలం

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే తొలి రోజులు. దగ్గర్లో ఏమైనా నదులు, సముద్రాలుంటే అందరూ అక్కడ పుణ్యస్నానాలు చేసి, పెద్దలను గుర్తు చేసుకుని వారికి పూజ చేయటంతో సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది. మంచు తెరల మధ్య చల్లని గాలులను సైతం లెక్కచేయకుండా బ్రహ్మీముహూర్తంలోనే భోగి మంటల సందడి మొదలు పెట్టడం అనే అనుభుతి మాటలకు అందదు.

పనికిరాని చెత్తను ఏరేస్తే నెగటివ్ ఎనర్జీ పోతుంది

భోగి పండుగ ముందు రోజంతా మామూలు కోలాహలం ఉండదు. భోగి మంటలు వేసేందుకు కట్టెలు వాడటమే కాదు ఇంట్లో పనికిరాని చెక్కసామానంతా ఆ భోగి మంటల్లో వేసేస్తారు. ఇలా ఇంట్లోని చెత్తను కాల్చేస్తే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. నెగటివ్ ఎనర్జీని తరిమేయటం ఇందులోని ఆంతర్యం. భోగి మంటతో అందుకే సౌభాగ్యం వస్తుంది. భోగిమంటల్లో దరిద్రం అంతా పోయి సిరిసంపదలు వచ్చేలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని విశ్వాసం. అందుకే భోగి మంటలో భోగి మంటలో భోగ భాగ్యాల భోగి మంటల్లో అని పాటలు పాడుతారు. శుభాన్ని కలిగించేది భోగి మంటలు.

భోగి మంటలు ఆరోగ్యం ఇస్తాయి

బోగి మంటల్లో ఆవు పిడకలను ఉపయోగిస్తారు. ఆవు పిడకలను కాల్చటంతో గాలి శుద్ధి అవుతుంది. పైగా ఈ మంటల్లోకి రావి, మామిడి, మేడి వంటి చెట్ల ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. నిజానికి బోగి మంటల్లోకి కిరోసిన్ కాదు నెయ్యి వేసి వెలిగిస్తారు. ఇలా చేయటంతోవచ్చే గాలి శరీరానికి చాలా మంచిది చేస్తుంది. ఔషధ గుణాలున్న ఈ గాలిని పీల్చటమే భోగమంటల్లోని సైంటిఫిక్ రీజన్. మానవ శరీరంలోని 72వేల నాడుల్లోకి ఈ గాలి ప్రవేశించి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇక కొందరు ధనుర్మాసం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి పెట్టిన గొబ్బెమ్మలను బోగి మంటల్లో ఉపయోగిస్తారు. చలికాలంలో వచ్చే స్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టేది భోగి మంటలు. బోగి మంటలు వేసేముందు బోగి పూజ మనసావాచా కర్మణా ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థమైందా.

బొమ్మల కొలువు కూడా

బోగిరోజు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దసరాకు బొమ్మల కొలువు పెడితే కొందరు దీపావళికి పెడతారు. మరికొందరు సంక్రాంతిలో బొమ్మల కొలువు పెట్టి, పేరంటాలు చేస్తారు. పోటాపోటీగా, క్రియేటివ్ గా బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం కాస్త కష్టమైన పనే. కానీ ఇదంతా సంప్రదాయం, గ్రామాల్లో ప్రతిష్ఠాత్మకం కూడా.. అదేంటి బొమ్మల కొలువు పెట్టలేదా అంటారు.

బోగి పళ్లతో ఆశీర్వాదం

సాయంత్రం బోగి పళ్లు వేసి చిన్నారులను ఆశీర్వదిస్తారు. రేగిపళ్లు, చిల్లర నాణేలు, చెరకు ముక్కలు, పూలు, చాక్లెట్లు వంటివన్నీ తలమీద పోసి పేరంటం నిర్వహిస్తారు. పెద్దలు ఇలా బోగి పళ్లు చిన్నారులపై పోస్తే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు వారిని ఆశీర్వదిస్తాడు. పిల్లపై ఉన్న చెడు దిష్టి పోతుంది. భోగి పళ్లను తలపై పోయటంతో తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం యాక్టివ్ అయి పిల్లల్లో జ్ఞానం అంటే ఐక్యూ, జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం 5 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే బోగి పళ్లు పోస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో 12 ఏళ్ల లోపు పిల్లల వరకు భోగి పళ్లు పోసే ఆచారాలున్నాయి. రేగిపళ్లు తింటే సీ విటమిన్ పెరగటమే కాదు, ఇమ్యూనిటీ పెరిగి, జీర్ణసంబంధమైన వ్యాధులన్నీ పోతాయి. మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న రేగిపళ్లను ఈసీజన్ లో కనీసం ఒక్కరోజైనా తప్పకుండా అందరూ తినేలా చేయటమే ఈ అకేషన్ లో ఉన్న మరో ఆంతర్యం.

పశువుల పండగ-కాటమ రాజు పూజ

కనుమరోజు నాన్ వెజ్ వంటలు చేసుకుంటారు. గోవులను, పశువులను పూజిస్తారు. కనుమ అంటే పశువుల పండుగ. ఏడాదికోమారు పశువులన్నింటికీ తినిపించే ఔషధ మూలికలతో చేసిన ఉప్పు చెక్కను తినిపిస్తారు. దీంతో పశుసంపద ఆరోగ్యంగా ఉంటుందని, ఆయుర్వేద వైద్యాన్ని రైతులు కనుమ రోజు పాటిస్తారు. ఆతరువాత వీటిని నీళ్లతో బాగా కడిగి, అందంగా అలంకరిస్తారు. ఇక సాయంత్రం కాటమరాజు పూజ చేయటం కొన్ని ప్రాంతాల్లోని ఆచారం. పశువులకు..రకరకాల నగలుగట్రా వేసి, మేకప్ చేసినట్టు చేసి, అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఆతరువాత ఎడ్లపరుగు పందేలు, ఎడ్లబండ్ల పందేలు, వీటితోపాటు బరువులు ఎత్తటం లాంటి గ్రామీణ ఆటలు, పందేలు మంచి జోష్ ను నింపేలా ఉంటాయి.

జల్లికట్టు

చిత్తూరు జిల్లాలో, తమిళనాడులో జల్లికట్టు ఆటలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ప్రమాదకరమైన విన్యాసమైనా దీన్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు. రంకెలేసే పోట్ల గిత్తలు, కోడెగిత్తలు, జల్లికట్టులో జనాల మీదకు దూసుకొస్తుంటాయి. గోదారి జిల్లాల్లో గోడిపందేలు ఎంత ఫేమస్సో చిత్తూరు జిల్లాలో జల్లికట్టు అంత ఫేమస్. కోడెగిత్తలను నిలువరించే ప్రయత్నం చేసేందుకు యువత రంగంలోకి దిగటం, గాయాలుపాలు కావటం ఆటలో భాగం. కానీ ఇదంతా పౌరుషానికి ప్రతీక అనేది వీరి విశ్వాసం. బుల్ రన్ లా ఇది ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది.

కంబాళ సీజన్ ఇదే

ఎద్దులతోపాటు వరి మడిలో పరిగెత్తటం, ఎవరు ముందొస్తే వారే విజేతలు అనేదే కంబాళా ఆట. పంట కోశాక పంట మడులలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తారు. నిజానికి సంక్రాంతి ముందు నుంచే కంబాళ పోటీలు మొదలైనా, కర్నాటకలోని కొన్నిప్రాంతాల్లో సంక్రాంతి, కనుమ రోజు ప్రత్యేకంగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి తరువాత కూడా ఈ పోటీలు సాగుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News