Chandra Grahanam 2025 in India: ఈ సంవత్సరం రెండో చంద్రగ్రహణం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏర్పడుతోంది. ఈ సమయంలో చంద్రుడు బంగారు ఎరుపు వర్ణంలోకి మారుతాడు. దీనినే సంపూర్ణ చంద్రగ్రహణం లేదా బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈసారి సంభవించబోయే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించబోతుంది. ఈ గ్రహణం సెప్టెంబరు 7 రాత్రి 9: 58 గంటలకు ప్రారంభమై సెప్టెంబరు 8 తెల్లవారుజామున 1: 26 గంటలకు ముగుస్తుంది. పైగా ఈ చంద్రగ్రహణం రోజునే పితృపక్షం కూడా ప్రారంభం కానుంది. 100 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ గ్రహణానికి మరింత ప్రాధాన్యత పెరిగింది.
సూతక కాలం ఎన్ని గంటలు?
సూతక కాలం గ్రహణానికి 9 గంటల ముందు ఉంటుంది. అంటే సూతకం మధ్యాహ్నం 12: 57 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం నిషిద్ధం. అందుకే ఆలయాల తలుపులు మూసివేస్తారు. అయితే మంత్రాలు పఠించవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత యధావిథిగా పూజలు చేసుకోవచ్చు. ఈ గ్రహణం మన దేశంతోపాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో కనిపించనుంది.
Also read: Pitru Paksha 2025 – పితృ పక్షంలో 100 సంవత్సరాల తరువాత మహా అద్భుతం…
కార్న్ మూన్ సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది. ‘కార్న్ మూన్’ అనేది పౌర్ణమికి మరో పేరు. సెప్టెంబర్ 7, 2025న వచ్చే పౌర్ణమి కూడా సంపూర్ణ చంద్రగ్రహణంతో సమానంగా ఉంటుంది. అందువల్ల దీనిని “కార్న్ మూన్ ఎక్లిప్స్” అని కూడా పిలుస్తారు. భూమి నీడ చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా కప్పినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.
ఏయే దేశాల్లో కనిపించబోతుంది?
సెప్టెంబర్ 7న ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం, చైనా, రష్యా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా మరియు అరబ్ దేశాలలో బాగా కనిపిస్తుంది. ఇది ఉత్తర అమెరికాలో కనిపించదు, అయితే అలాస్కా పశ్చిమ భాగం నుండి పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. యూకే మరియు పశ్చిమ ఐరోపాలో చంద్రుడు ఉదయించినప్పుడు గ్రహణంలో కొంత భాగం కనిపిస్తుంది. మన దేశంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:25 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. దీనినే రక్త చంద్రుడు అని కూడా అంటారు.
Also Read: Sun Transit 2025- హస్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు ఆఖండ ధనయోగం..


