Sunday, February 8, 2026
HomeదైవంBlood Moon 2026: మార్చి 3న 'బ్లడ్ మూన్'.. ఎక్కడ చూడొచ్చంటే?

Blood Moon 2026: మార్చి 3న ‘బ్లడ్ మూన్’.. ఎక్కడ చూడొచ్చంటే?

First Lunar Eclipse 2026 date and timings in India: అంతరిక్ష ప్రియులకు 2026 ఒక పండగ లాంటి ఏడాది. ఈ ఏడాది మార్చి నెలలో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడినట్టే.. భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ క్రమంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారే ఈ అద్భుతాన్ని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.

- Advertisement -

తేదీ మరియు సమయం
భారత కాలమానం ప్రకారం, ఈ ఖగోళ వింత మార్చి 3, 2026న (మంగళవారం) కనిపిస్తుంది. గ్రహణం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5:03 గంటల నుండి 6:02 గంటల మధ్య గరిష్టంగా గ్రహణం ఉంటుంది.

మన దేశంలో కనిపిస్తుందా?
భారతదేశంలో ఈ గ్రహణం చివరి దశలో కనిపిస్తుంది. ఇది అసోం, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో (కోల్‌కతా, గువహటి వంటి నగరాల్లో) స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది.

బ్లడ్ మూన్ అంటే ఏమిటి?
సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి యొక్క వాతావరణం గుండా వెళ్ళే సూర్యకిరణాలు వక్రీభవనం చెంది చంద్రుడిపై పడతాయి. దీనివల్ల చంద్రుడు ముదురు ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.

Also Read:Holika Dahan 2026 – గ్రహణం నీడలో హోలీ.. మార్చి 3న హోళికా దహనం చేయొచ్చా?

ఎలా చూడాలి?
సూర్యగ్రహణంలా కాకుండా, చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. దీనివల్ల కళ్లకు ఎలాంటి హాని కలగదు. బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే చంద్రుడిపై రంగు మార్పులను మరింత స్పష్టంగా గమనించవచ్చు. ఆకాశం నిర్మలంగా, కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

నోట్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయాల్లో కొన్ని నియమాలు పాటించే వారు సూతక కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News