Sunday, March 23, 2025
HomeదైవంOntimitta: ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

Ontimitta: ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

- Advertisement -

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి (Sri Kodandarama Swamy Temple)ఆల‌యంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
06-04-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం)
రాత్రి – శేష వాహనం

07-04-2025
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం

08-04-2025
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం

09-04-2025
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం

10-04-2025
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ

11-04-2025
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము

12-04-2025
ఉదయం – రథోత్సవం

13-04-2025
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం

14-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News