Tuesday, September 17, 2024
HomeదైవంBramhagundam: శివనామ స్వరంతో మారుమోగిన బ్రహ్మగుండం క్షేత్రం

Bramhagundam: శివనామ స్వరంతో మారుమోగిన బ్రహ్మగుండం క్షేత్రం

పోటెత్తిన శివాలయాలు

కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్వరంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు పూజలు భక్తులు నిర్వహించారు. మహా శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో శివుని పూజించడం వల్ల కష్టాలు కడతీరుతాయని భక్తుల నమ్మకం శైవ క్షేత్రాలలో ముఖ్యమైన క్షేత్రం బ్రహ్మగుండం చాలా మహిమలు గల క్షేత్రం బ్రహ్మ గుండేశ్వరుని దర్శనం తెల్లవారి నాలుగు గంటల నుండే ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మధుసూదన్ జ్ఞాపకార్థం కుమారుడు అమర్నాథ్ శెట్టి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నదానం కార్యక్రమం చేశారు భక్తులు కోనేరులో స్నానం చేసి స్వామివారిని మహిళలు స్వామివారి ముందట ప్రథమలు అంటించారు దర్శించుకున్నారు వెల్దుర్తి లోని పురాణ దేవాలయం కాశీశ్వర్ స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి ఘనంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి సుంకన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News