Bruhaspathi Gochar in Karkataka Rashi 2025: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని జ్ఞానానికి, సంతానానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం దేవగురు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. దసరా తర్వాత గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడే సుమారు 50 రోజులపాటు ఉండనున్నాడు. తిరిగి డిసెంబరు 5న మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. బృహస్పతి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారి ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
మకర రాశి
కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం మకరరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్లోని అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి స్థాయికి వెళతారు. మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ సఫలీకృతమవుతాయి. ఆఫీసులో మీ పై అధికారి నుండి ప్రశంసలతోపాటు సపోర్టు కూడా లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. వ్యక్తిగత, వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లైన వారికి సంతానప్రాప్తికి అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గురుడు సంచారం శుభఫలితాలను పొందుతారు. కెరీర్ లో అనేక విజయాలను సాధిస్తారు. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీరు సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. కొత్తగా పెళ్లైన భార్యభర్తలు హానీమూన్ కు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన బైక్ లేదా కారు కొనుగోలు చేయవచ్చు. బిజినెస్ లో లాభాలు ఉండటంతో మరికొన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేస్తారు.
కన్యా రాశి
బృహస్పతి సంచారం కన్యారాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. పెద్ద బిజినెస్ డీల్ ఓకే అవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కెరీర్ కీలక మలుపు తిరుగుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వైవాహిక, వ్యక్తిగత జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారాలు సజావుగా నడుస్తాయి. జాబ్ కోసం ఎదురుచూసే వారు కోరిక నెరవేరుతోంది.
Also Read: Hartalika Teej Vratam 2025- పెళ్లికాని అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త దొరుకుతాడట..!
మిథున రాశి
మిథునరాశి వారికి దేవగురు సంచారం ఎన్నో లాభాలను తీసుకురాబోతుంది. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. వ్యాపారం లాభసాటిగా మారుతుంది. ఉద్యోగులకు ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. విదేశీయానం ఉంది. కెరీర్ లో ఎన్నడూ చూడని స్థాయికి వెళతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.


