Budh kuja conjunction 2025: ప్రతి నెలా గ్రహాలు రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. తెలివితేటలు, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడు.. ధైర్యం, భూమికి సంబంధించిన కుజుడు త్వరలో తులా రాశిలో కలవబోతున్నారు. వీరిద్దరి సంయోగం ద్వాదశ రాశులపై పడుతుంది. అయితే బుధుడు, అంగారకుడు కలయిక వల్ల ఏయే రాశులవారు లాభాలు పొందనున్నారో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ప్రధాన గ్రహాల సంయోగం వృశ్చిక రాశి వారి ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు ఊహించని ఫలితాలు పొందుతారు. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. మీకు అదృష్టంతో ఐశ్వర్యం కూడా ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది.
మకరరాశి
బుధుడు, కుజ గ్రహాల కలయిక మకర రాశి వారు తలరాతను మార్చబోతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వివాహప్రాప్తికి అవకాశం ఉంది. కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులు లాభపడతారు. రుణ విముక్తి పొందుతారు. సంసారం జీవితం సాఫీగా సాగుతోంది. మీ పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు. ధనార్జన పెరుగుతుంది.
కర్కాటక రాశి
తులా రాశిలో బుధుడు, కుజుడు కలయిక వల్ల కర్కాటక రాశి వారు మంచి ఫలితాలను పొందబోతున్నారు. వ్యాపారం వృద్ధి చెందడంతో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ సాధిస్తారు.
Also Read: Ashwin Month 2025-అశ్వినీ మాసంలో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
కన్యా రాశి
రెండు ప్రధాన గ్రహాల సంయోగం కన్యా రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి మీ సొంతం అవుతుంది. కెరీర్ లో మీరు ఎక్కడికో చేరుకుంటారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను చూస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఓ రేంజ్ లో పెరుగుతుంది. లక్ కలిసి వస్తుంది. అప్పుల భారం నుండి బయటపడతారు.
Disclaimer: ఇక్కడ ఇచ్చిన కథనం పూర్తిగా నిజమైనదని మేము ఖచ్చితంగా చెప్పలేం. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Next Eclipse 2025-తర్వాత గ్రహణం ఎప్పుడు? అది ఇండియాలో కనిపిస్తుందా?


