Mercury Transit Positive effect: గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తూ ఉంటాయి. గ్రహాలకు యువరాజైన బుధుడు మూడు రోజుల కిందట అంటే జూన్ 22న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా రెండు నెలలపాటు మూడు రాశులవారి సుడి తిరగబోతుంది. బుధుడు రాశి మార్పు ఏయే రాశులవారికి లాభం చేకూర్చనుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. దీని కారణంగా కర్యాటక రాశి వారి దశ మారబోతుంది. కెరీర్ లో అద్భుతంగా రాణిస్తారు. మీరు పడ్డ కష్టానికి మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎంతో కాలంగా రాని ప్రమోషన్ ఇప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానసాపల్యత కలుగుతుంది. ఈ సమయంలో తీరని కోరికలన్నీ తీరుతాయి. దారిద్రం నుంచి విముక్తి పొందుతారు.
మిథునరాశి
బుధుడి సంచారం మిథునరాశి వారికి ఎనలేని కీర్తిని తెస్తుంది. రాబోయే రెండు నెలలపాటు ఎప్పుడు చూడని అద్భుతాలు చూస్తారు. మీరు దుబారా తగ్గించి డబ్బును పొదుపు చేస్తారు. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. మీరు భారీగా ధనార్జన చేస్తారు. ఉన్నత స్థానంలో వ్యక్తులతో మీరు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
కన్యారాశి
కన్యారాశి వారికి బుధుడి స్థానం మార్పు కలిసి వస్తుంది. మీకు ప్రముఖుల ప్రశంసలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రేమ ఫలిస్తుంది. మీరు రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కెరీర్ రాకెట్ స్పీడ్ లా దూసుకుపోతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ఎంతో జాబ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.