Budh Margi 2025 in August: వేద జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అనే పేర్లుతో పిలుస్తారు. మెర్క్యూరీ తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కు సంకేతంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, తిరోగమనంలో ఉన్న బుధుడు ఆగస్టు 11 మధ్యాహ్నం 12.59 గంటలకు ప్రత్యక్ష మార్గంలోకి రానున్నాడు. నవంబరు 10 వరకు అదే స్థితిలో ఉండనున్నాడు. బుధుడి యెుక్క ఈ ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథునరాశి
బుధుడు నేరుగా నడవడం వల్ల మిథునరాశి వారు శుభఫలితాలను పొందుతారు. కెరీర్లో ఉన్న ఫలంగా మార్పు వస్తుది. మీరు అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. మీ జీవితంలో సానుకూలత ఉంటుంది. అంతేకాకుండా అప్పుల ఊబి నుండి బయటపడతారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహ యోగం ఉంది. అదృష్టంతోపాటు అపారమైన సంపద మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృశ్చిక రాశి
బుధుడు యెుక్క ప్రత్యక్ష కదలిక వృశ్చిక రాశివారికి సానుకూలంగా ఉండనుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కల నెరవేరుతోంది. మీ కెరీర్ ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చి పడుతుంది. దారిద్ర్యం దాదాపు తొలగిపోతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు.
Also Read: Mars Transit 2025 – రక్షాబంధన్ తర్వాత ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీది ఉందా?
తులా రాశి
బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల తులా రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. కెరీర్ లో అనుకోని ఎదుగుదల ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. అప్పులు దాదాపు తీరిపోతాయి. తుల రాశి వారి అన్నీ కష్టాలు తీరిపోతాయి. ప్రతి పనిలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ధనప్రాప్తికి అవకాశం ఉంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితులు సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా పై కథనాన్ని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


