Mercury Retrograde 2025 effect: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, బుధుడిని గ్రహాల యువరాజు లేదా ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలోకెల్లా అతి తక్కువ పరిభ్రమణ కాలం ఉండే ప్లానెట్ ఇదే. దీనిని శుభగ్రహంగా కూడా పిలుస్తారు. అయితే ఇటీవల(జూలై 11) మెర్క్యూరీ సింహరాశిలో తిరోగమనం చేశాడు. అదే స్థితిలో ఆగస్టు 11 వరకు ఉంటాడు. సాధారణంగా వక్ర స్థితిలో ఉన్న గ్రహాలు చెడు ప్రభావాలనే చూపిస్తాయి. బుధుడి యెుక్క ఈ పరిణామం కూడా కొన్ని ఇబ్బందులను సృష్టించనుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, టెక్నాలజీ, ప్రయాణాలు, నిర్ణయాలు తీసుకోవడంలో అడ్డంకులను సృష్టిస్తుందని పండితులు చెబుతారు.
సింహరాశిలో బుధుడి రివర్స్ కదలిక మెుత్తం 12 రాశిచక్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే సింహం అగ్ని రాశికి చెందినవాడు. పైగా క్రియేటివిటీ, లీడర్ షిప్, ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటారు. ఇలాంటి సమయంలో మీ మాటలు ఉద్వేగభరితంగా ఉండవచ్చు. దీని మూలంగా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ సంభాషణలను ఎవరైనా వక్రికీరించే అవకాశం ఉంది. ఈ సమయంలో కాంట్రాక్ట్‌ల జోలికి పోకండి. ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీ తెలివితేటలకు పదునుపెట్టి గత విషయాలను పున:సమీక్షించుకోండి.
బుధుడి యెుక్క ఈ కదలిక మూడు రాశులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ముఖ్యంగా ఈ సమయంలో మేషం, సింహం, మీన రాశుల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మేషరాశి వారు ఇతరుల సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అది అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. సింహ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీనరాశి వారి ఆలోచనలు స్పష్టంగా లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ-మెయిల్స్ పంపడం, ఒప్పందాలపై సంతకాలు చేయడం, దూర ప్రయాణాలు మానుకోవడం వల్ల మీ సమస్యలను నివారించే అవకాశం ఉంది. ఈ సమయంలో కంగారుగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది కాదు. మెుత్తానికి ఈ మూడు రాశుల వారు ఈ కాలంలో కాస్త ఓపికతో ఉండటంతోపాటు అప్రమత్తంగా మెలగాలి.


