Benefits of Budhaditya Yoga: గ్రహాల రాజు సూర్యుడు, యువరాజు బుధుడు ఆగస్టు నెల చివరిలో అంటే ఆగస్టు 30, 2025న సాయంత్రం 4:48 గంటలకు సింహరాశిలో కలవబోతున్నారు. వీరిద్దరి సంయోగం వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. వైదిక జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం సెప్టెంబరు 15 వరకు ఉండబోతుంది. దీంతో కొందరి సుడి తిరగబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
బుధాదిత్య రాజయోగం సింహరాశి యెుక్క మొదటి ఇంట్లో ఏర్పడబోతుంది. ఇది వ్యక్తిత్వం, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన నిలయం. పైగా ఇది సూర్యుడు యెుక్క సొంతరాశి. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మీ ఇమేజ్ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు. టాలెంట్ చూపించడానికి ఇదే అనుకూల సమయం. మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు.
తులా రాశి
తులారాశి యెుక్క 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. ఇది లాభం, స్నేహం మరియు కోరికలకు సంబంధించినది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు చేపట్టిన ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు భారీ డీల్స్ కుదుర్చుకుంటారు. పాత పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు వేసుకున్న ఫ్లాన్స్ ఫలిస్తాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది.
మేషరాశి
బుధాదిత్య రాజయోగం వల్ల మేషరాశి యెుక్క ఐదో ఇంట్లో ఏర్పడబోతుంది. సృజనాత్మక రంగం అంటే రచన, కళ లేదా డిజైన్ వంటి పనులు చేసేవారు ప్రశంసలతోపాటు భారీగా డబ్బును పొందుతారు. సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఇదే అనుకూల సమయం. అభ్యర్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఈ టైంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Also Read: Shukra Gochar 2025 – ఆగస్టు 23న శుక్రుడు అద్భుతం.. ఈ 5 రాశులకు సుడి తిరగడం ఖాయం..
మిథున రాశి
మిథున రాశి బుధుడు సొంత రాశి. పైగా బుధాదిత్య యోగం మూడో ఇంట్లో ఏర్పడబోతుంది. ఇది ఇల్లు సంభాషణ, ధైర్యం మరియు ప్రయాణాలకు సంబంధించినది. జర్నలిజం, రచన లేదా డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అంతేకాకుండా బిజినెస్ ను కూడా విస్తరిస్తారు. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మీరు ఫ్రెండ్స్ అండ్ తోబుట్టువుల సహాయం పొందుతారు. చిన్న ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
కర్కాటక రాశి
బుధాదిత్య రాజయోగం కర్కాటక రాశి వారి రెండో ఇంట్లో ఏర్పడబోతుంది. ఈ హౌస్ డబ్బు, కుటుంబం మరియు వాక్కుకు సంబంధించినది. ఈ యోగం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ మాటలతో ఆకట్టుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలిస్తాయి. మీరు విలువైన బంగారు ఆభరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే అనుకూల సమయం. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ మాటలతో నలుగురిని ఆకట్టుకుంటారు.
Also read: Bhadrapada Masam 2025 – భాద్రపద మాసం ఎప్పటి నుంచి? ఈ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు?


