Wednesday, September 11, 2024
HomeదైవంChagalamarri: గాజుల అలంకారంలో పార్వతి దేవి అమ్మవారు

Chagalamarri: గాజుల అలంకారంలో పార్వతి దేవి అమ్మవారు

అధిక శ్రావణం దేవికి గాజుల అలంకారం

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో అధిక శ్రావణమాసం సందర్భంగా కూరపాటి బజార్ లో ఉండే శ్రీ కోదండరామ స్వామి దేవాలయములో పార్వతి దేవి అమ్మవారికి గాజుల అలంకారం చేసి విశేష పూజలు జరిపారు. మహిళల ఆధ్వర్యములో లలిత సహస్రనామ పారాయణం జరిపించారు. ఆలయములో సామూహికంగా 108 మంది మహిళలకు గాజుల పంపిణీ కార్యక్రమం, వడిబియ్యం పోశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గాజులతో అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. కమిటీ సభ్యులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూరపాటి సునీత లక్ష్మి , తొమ్మండ్రు సుప్రజ , ఇందిర , సులోచన , సత్యవతి , తొమ్మండ్రు భవానమ్మా , లింగం సంతోషి లక్ష్మి , అమరావతి సువర్ణ , నలమారి గంగా భవాని , వల్లంకొండు ఉషారాణి , బచ్చు సువర్ణ , బచ్చూ సునీత , ఇతర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News