Tuesday, September 17, 2024
HomeదైవంChagalamarri: శివుడికి అన్నాలంకరణ

Chagalamarri: శివుడికి అన్నాలంకరణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా..

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక గాంధీ సెంటర్ కూరపాటి వీధిలోని కోదండరామాలయంలో కొలువుదీరిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, పార్వతి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. తొమ్మండ్రు భవానమ్మ, కూరపాటి సునితాలక్ష్మి ఆధ్వర్యములో ఈశ్వరుడికి అన్నాలంకారం, అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం దేవాలయం ఆవరణలో దీపాలు వెలిగించి దీపాలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

- Advertisement -

అనంతరం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం, పారాయణము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు, దుర్బాక రాజేంద్ర శర్మ, అధ్యక్షుడు, మదళ్ళపల్లే సత్యనారాయణ, తోమ్మండ్రు మల్లికార్జునరావు, కైప శేషయ్య శర్మ, కోశాధికారి కూరపాటి లక్ష్మీనారాయణ, కార్యదర్శులు వంకదార లక్ష్మణ బాబు, బి. సుదర్శనం, వెంకట క్రిష్ణయ్య, కూరపాటి జగదీశ్, లింగం రంగనాథ్, తోటంశెట్టి బాబు, వాసుదేవయ్య, మహిళ మండలి సంఘం తదితరులు పాల్గొన్నారు.

ఇలా చేస్తే మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా… మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే… కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.

ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

  • శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
    నర్మదే సింధు కావేరి జలే……స్మిన్‌ సన్నిధింకురు||

ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద, బియ్యం పిండితో చేసిన ప్రమీదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రథము, అష్టశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగుంచే ఆనేక దీపాలవల్ల వాటినుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీ పేరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News