Friday, November 22, 2024
HomeదైవంChardham: చార్ ధామ్ యాత్ర ఎందుకు చేయాలి?

Chardham: చార్ ధామ్ యాత్ర ఎందుకు చేయాలి?

చార్ ధామ్ యాత్ర మోక్షానికి రాచబాట

అక్షయ తృతియ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి గుడి తలుపులు సంప్రదాయ పూజలతో తెరుచుకున్నాయి. తృతియ రోజు ఉదయం 7 గంటలకు భక్తుల సమక్షంలో వీటి ద్వారాలు తెరుచుకున్నాయి.

- Advertisement -

కేదార్నాథ్ కు తొలిరోజే 10,000 మందికి పైగా భక్తులు వచ్చి బారులు తీరారు. 20 క్వింటాళ్లకు పైగా వివిధ రకాల పూలను తీసుకువచ్చి కేదార్నాథ్ ను ముస్తాబు చేశారు.

ఉత్తరకాశిలోని యమునోత్రి ఆలయ దర్శనానికి కూడా వేలాదిమంది భక్తులు వచ్చి..జై మా యమునా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈరోజే గంగోత్రి గుడిని కూడా తెరవగా, బద్రినాథ్ గుడి తలుపులు మాత్రం ఆదివారం తెరుచుకోనున్నాయి.

ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో చార్ ధామ్ వెళ్లాలన్న యాత్రికులు రిజిస్టర్ చేసుకోవచ్చు. 8394833833 వాట్సప్ నంబర్ కు వాట్సప్ టెక్స్ట్ పంపి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ దర్శనాన్ని చార్ ధామ్ అంటారు. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యయాత్రగా భావిస్తారు. ఈ ఏడాది నవంబర్ 13వ తేదీలోగా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను మూసివేస్తారు.

భారతీయుల జీవితాల్లో మోక్ష ప్రాప్తికి చార్ ధామ్ చాలా కీలకమైనవిగా భావిస్తారు. ఇక చార్ ధామ్ అంటే బడా చార్ ధామ్, ఛోటా చార్ ధామ్ అని పుణ్యతీర్థాలున్నాయు. వీటిలో బడా చార్ ధామ్ అంటే పూరి, ద్వారక, రామేశ్వరం, బద్రినాథ్ లను కలిపి అంటారు. ఈ నాలుగు గుళ్లూ నాలుగు యుగాలకు నిలువెత్తు రూపాలన్నమాట. అంటే బద్రినాథ్ సత్య యుగానికి చిహ్నం, రామేశ్వరం త్రేతాయుగానికి, ద్వారక ద్వాపరయుగానికి, పూరి కలియుగానికి గుర్తుగా భావిస్తారు. ఈ నాలుగు దేశానికి నలుమూలలా ఉంటాయి. తూర్పున పూరి జగన్నాథ్, ఉత్తరాన బద్రినాథ్ బద్రినారాయణుడు, పశ్చిమాన ద్వారకా కృష్ణుడు (ద్వారకాధీష్), దక్షిణాన రామేశ్వరం రామనాథ స్వామి కొలువై ఉన్నారు.

వీటిలో రెండు శైవానికి, రెండు వైష్ణవ తత్వానికి ప్రతీకలు. ద్వారక-పూరిలు ఒకే అక్షాంశంలో ఉండగా ఈ రెండూ వైష్ణవ తత్వాన్ని ఉపదేశిస్తాయి. బద్రినాథ్-రామేశ్వరం ఒకే రేఖాంశాల్లో ఉంటాయి. ఈ నాలుగు చుక్కలను కలిపి చూస్తే ఒక చతురస్రాకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నాలుగు ధామాల్లోనూ జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరమఠాలను అంటే పీఠాలను స్థాపించి, హైందవ ధర్మ రక్షణను కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు పీఠాల్లో ఒక్కో మఠం ఒక్కొక వేదాన్ని పరిరక్షిస్తుంది. బద్రినాథ్ లోని మఠాన్ని జ్యోతిర్మఠం అంటారు. జ్యోతిర్మఠం అథర్వణ వేదాన్ని, ద్వారకా పీఠంలోని శారదా మఠం సామ వేదాన్ని, ద్వారకాలోని గోవర్ధన్ మఠం రుగ్వేదాన్ని, శృంగేరి మఠం యజుర్వేదాన్ని పరిపక్షిస్తాయి.

ఇక మినీ చార్ ధామ్ లేదా ఛోటా చార్ ధామ్ అంటే పైన మనం చెప్పుకున్న కాదార్, బద్రి, గంగోత్రి, యమునోత్రి. అక్షయ తృతీయ నాడు తెరుచుకునే మినీ చార్ ధాం దీపావళి తరువాత వచ్చే ధనత్రయోదశికి మూసివేస్తారు.

అత్యంత పురాతమనమైన పుణ్యక్షేత్రాల సందర్శనతో, పుణ్యతీర్థాల్లో పవిత్ర స్నానాలు చేయటం ద్వారా మనం పూర్వ జన్మ, ప్రస్తుత జన్మల కర్మ శేషాన్ని కడుక్కుని, పునీతులు అవ్వచ్చు. శారీరక, మానసిక, ఆర్థిక శ్రమకు ఓర్చి ఇలాంటి యాత్రలను చేస్తే పునర్జన్మ నుంచి విముక్తిని సంపాదించుకోవచ్చు. అత్యుత్తమైన జన్మ మానవ జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News