రుషికేష్ నుండి ఉత్తరాఖండ్ లోని కర్ణ ప్రయాగ వరకు హిమాలయాల పర్వత పంక్తి పాదాల వద్ద నిర్మితమవుతోన్న 125 కిలో మీటర్ల రైల్వే లైను, 2015 లో, NDA ప్రభుత్వంలో, ₹ 16,200 కోట్ల అంచనా వ్యయంతో పని జోరుగా సాగుతోంది. ఈ నిర్మాణంలో 12 స్టేషన్లు, 35 వంతెనలు, 17 సొరంగాలు, ఉన్నాయి. మొత్తం ప్రయాణంలో ఈ సొరంగాల ప్రయాణం 84 శాతం. ఈ మొదటి దశ నిర్మాణం డిసెంబరు 2025 కు పూర్తి అవుతుంది.
బద్రీ-కేదార్ కు ట్రైన్లో
పుణ్యక్షేత్రాలు అయిన యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, మరియు కేదార్నాథ్లను కలుపుతూ భారతీయ రైల్వే యొక్క చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్ లో, ఇది ప్రధానమైన మార్గం (భాఘం). చార్ధామ్ యాత్రకు భక్తులకు ఇది సుఖవంతమైన ప్రయాణం. దీని ద్వారా టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాఖండ్ సంక్షేమానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
చైనాకు చెక్ పెట్టేలా
చైనా దేశం దురాక్రమణ చేయకుండా మన భూభాగం మనం అభివృద్ధి చేసుకునే వ్యూహం ఇది. చైనా సరిహద్దులకు మన సైనిక దళాలను త్వరగా చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు 7 గంటల ప్రయాణం చేయవలసినది, దీనివల్ల 2 గంటల్లోనే పూర్తి అవుతుంది.