chaturgrahi yog in scorpio 2025: గ్రహాలన్నింటిలోకెల్లా వేగంగా కదిలేది చంద్రుడు. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. చంద్రుడు గ్రహాలను రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో కలిసి అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంది. ప్రస్తుతం అంగారకుడు, బుధుడు మరియు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. నవంబర్ 20నచంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించడం వల్ల అరుదైన చతుర్గ్రాహి యోగం సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఇదే రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీంతో మీ కోరికలన్నీ సకాలంలో నెరవేరుతాయి. మీరు ముట్టిందల్లా బంగారం అవుతుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆ లక్షీదేవి కటాక్షం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు భారీగా డబ్బును కూడబెడతారు.
తులా రాశి
చతుర్గ్రాహ యోగం తులా రాశి వారి తలరాతను మార్చబోతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. విద్యార్థులు మరియు పోటీపరీక్షలకు సిద్దమయ్యే వారు ప్రయోజనం పొందుతారు. ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే తగిన సమయం. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు లాభపడతారు.
Also Read: Sun Transit -శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు జాక్ పాట్ గురూ..
వృషభ రాశి
వృషభ రాశి వ్యక్తులకు చతుర్గ్రాహ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకుంటారు. విద్య లేదా ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు.

