Chaturmas 2025 Effect On Zodiac Signs: ఈ ఏడాది తొలి ఏకాదశి మరో మూడు రోజుల్లో రాబోతుంది. ఈరోజునే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలలపాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటాడు. దీనినే చాతుర్మాసం అంటారు. ఈ చాతుర్మాసం జూలై 06న మెుదలుకానుంది. శ్రీహరి యోగనిద్రకు వెళ్లిన నాలుగు నెలల్లో శ్రావణ, భాద్రపద, అశ్వినీ, కార్తీక మాసాలు వస్తాయి. ఈ సమయంలో వివాహాది శుభకార్యక్రమాలు నిలిపివేయబడతాయి.
అయితే ఈ చాతుర్మాస సమయంలోనే కొన్ని గ్రహాల గమనంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గురుడు, శుక్రుడు మిథునరాశిలో సంచరించబోతున్నారు. సూర్యభగవానుడు కర్కాటక రాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇక కర్మఫలదాత అయిన శనిదేవుడు తిరోగమనంలో ఉండబోతున్నాడు. ఈ గ్రహ సంచారాల కారణంగా రాబోయే నాలుగు నెలలు నాలుగు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు.
మిథున రాశి
చాతుర్మాస సమయంలో ఇదే రాశిలో గురుడు, శుక్రుడు సంచరించబోతున్నారు. దీంతో మిథునవారు ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు. రాబోయే నాలుగు నెలల కాలంలో వీడి సుడి తిరిగి కోటీశ్వరులయ్యే ఛాన్స్ ఉంది. మీకు పూజలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ లైఫ్ పార్టనర్ ను మీ ఫ్యామిలీ మెంబర్స్ కు పరిచయం చేస్తారు. ఎంతో కాలంగా ఆగిపోయిన అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు.
మేష రాశి
ఈ రాశి వారికి చాతుర్మాసం ఎంతో అద్భుతంగా ఉండనుంది. శ్రీహరి ఆశీస్సులు మేషరాశి వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. దీంతో ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలను పొందుతారు. ఆకస్మికంగా ధనం పొందుతారు. మీరు కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే నాలుగు నెలలో కాలంలో సింహరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. పెళ్లి లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. కెరీర్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. సొంతంగా వ్యాపారం చేసేవారు భారీగా లాభాలను చూస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి ఈసారి చాతుర్మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ కృష్టికి ప్రశంలు దక్కుతాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ప్రమోషన్ కు అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ కెరీర్ లోఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి స్థానానికి చేరుకుంటారు. వైవాహిక జీవితం చూడముచ్చటగా ఉంటుంది. మీకు సంతానప్రాప్తి కలగవచ్చు.