నేడు తిరుపతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandra Babu) వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకోనున్నారు.
- Advertisement -
ఈరోజు రాత్రి 9.30గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఒకరోజు ఖర్చు రూ.44 లక్షలను విరాళంగా ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను నారా కుటుంబ సభ్యులు వడ్డించనున్నారు.