Srivari Darshan: కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు కిక్కిరిసిపోయాయి. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు
దర్శన సమయాల వివరాలు: రద్దీ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి దర్శనం కోసం 8 నుండి 10గంటల సమయం పడుతుంది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 3 నుండి 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వ్యవహరించాలని టీటీడీ అధికారులు తె క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ పానీయాలు, ఆహార సౌకర్యాలను నిరంతరం అందిస్తోందని అధికారులు తెలిపారు.
రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం: మంగళవారం రోజున తిరుమలలో భక్తుల తాకిడి రికార్డు స్థాయిలో నమోదైంది. మొత్తం 70,044 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 5.08 కోట్ల ఆదాయం సమకూరింది.

