Crow Sounds Good Or Bad: భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో పక్షుల ప్రవర్తనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటిలో ముఖ్యంగా కాకి ప్రవర్తనను గమనించడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. కాకులు సాధారణ పక్షులుగా కనిపించినా, కాకి అరవడం లేదా కదలికలు మన జీవితంలోని కొన్ని సంఘటనలను సూచిస్తాయని పండితులు చెబుతారు. దీనినే ‘కాకి శాస్త్రం’ లేదా ‘కాకి శకునం’ అంటారు. శనిదేవునితో కాకికి ఉన్న సంబంధం కారణంగా, దాని ప్రవర్తన భవిష్యత్తులో జరిగే విషయాలకు సూచనగా పరిగణిస్తారు.
కనిపించే విధానం, అరిచే సమయం..
కాకులు సాధారణంగా యమదూతలుగా కూడా భావిస్తారు. అవి కనిపించే విధానం, అరిచే సమయం, దిశ మొదలైనవి మన జీవితంలో ఏదో జరుగబోతుందనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. శుభం, అశుభం అనే రెండు కోణాల్లో కాకి సంకేతాలను పరిశీలిస్తారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/venus-transit-brings-luck-and-wealth-for-four-zodiac-signs/
గోడపై లేదా బాల్కనీలో…
ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో కాకి మన ఇంటి ఆవరణలో, గోడపై లేదా బాల్కనీలో కూర్చుని శబ్దం చేస్తే, కొంతమంది దాన్ని శుభ సూచనగా పరిగణిస్తారు. ముఖ్యంగా, మధ్యాహ్నం సమయంలో కాకి ఉత్తర దిశలో కూస్తే అదృష్ట సూచనగా నమ్మకం ఉంది. అదే కాకి తూర్పు దిశలో కూస్తే, ఆ వ్యక్తికి విజయాలు దగ్గరగా ఉన్నాయని భావిస్తారు. ఈ రకమైన శబ్దాలు ఏదో మంచి వార్త రాబోతున్నట్లు సూచిస్తాయని జ్యోతిష్య విశ్లేషకులు అంటారు.
ప్రయాణం చేయబోతున్న…
ఇంకా ఒక విశ్వాసం ప్రకారం, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్న సమయంలో కాకి అకస్మాత్తుగా మీ కిటికీ లేదా బాల్కనీలోకి వచ్చి అరుస్తుంటే, ఆ యాత్ర విజయవంతమవుతుందని అంటారు. ఈ పరిస్థితిని చాలా మంది మంచి ప్రయాణ శకునంగా చెబుతుంటారు..
నీరు తాగడం..
కాకి నీరు తాగడం కూడా శుభ సూచనగా ,చెబుతారు. ఎవరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి వెళ్తున్న సమయంలో కాకి నీరు తాగడం గమనిస్తే, ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారు. ఇది ఆ వ్యక్తికి ఆర్థిక లాభం లేదా ఆశించిన ఫలితాలు పొందే సూచనగా కూడా చెప్పవచ్చు.
ఆహారాన్ని తీసుకొని ఎగిరిపోతే..
మరికొన్ని సందర్భాల్లో కాకి ప్రవర్తన మన కోరికలు నెరవేరబోతున్నట్లు సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక కాకి రొట్టె ముక్క లేదా ఏదైనా ఆహారాన్ని తీసుకొని ఎగిరిపోతే, మీరు కోరుకున్న ముఖ్యమైన కోరిక త్వరలోనే నెరవేరవచ్చని అర్థం. ఈ విశ్వాసం పాతకాలం నుండి మన సంస్కృతిలో కొనసాగుతుంది.
చెడు సంకేతాలను ..
అయితే, కాకుల ప్రవర్తన ఎప్పుడూ శుభ సూచనే కాదు. కొన్నిసార్లు అవి చెడు సంకేతాలను కూడా తెలియజేస్తాయని జ్యోతిష్య విశ్లేషకులు చెబుతారు. మీ ఇంటి బాల్కనీలో లేదా పైకప్పుపై కాకుల గుంపు ఒకేసారి శబ్దం చేస్తే, అది సాధారణంగా చెడు శకునంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు కుటుంబంలో వివాదాలు, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చే సూచనగా పెద్దలు చెబుతుంటారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-tips-to-increase-wealth-flow-and-home-prosperity/
ముఖ్యంగా కాకి దక్షిణ దిశలో కూర్చుని నిరంతరం కూస్తుంటే, అది శుభం కాదని అంటారు. దక్షిణ దిశ యమదిశగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. కాబట్టి, ఇది పితృదోషం లేదా పూర్వీకుల అసంతృప్తిని సూచించే సూచనగా నమ్ముతారు. ఇలాంటి సమయంలో పితృకార్యాలు లేదా తర్పణాలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తారు.


