Curry Leaves Plant Vastu:మన ఇళ్లలో పచ్చదనాన్ని పెంచుకోవడం ఆరోగ్యానికీ, మనసుకు సంతోషాన్నీ ఇస్తుంది. కొందరు తోటపని అంటే ఇష్టంతో ఏ చిన్న మూల ఉన్నా పూలు, కూరగాయలు లేదా చెట్లు నాటుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు, మొక్కలను ఎక్కడ పెంచాలో, ఏ దిశలో పెంచాలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కొనసాగుతాయని నమ్మకం ఉంది.
ఆరోగ్యానికీ మేలు..
ఇంట్లో ఎక్కువగా పెంచే మొక్కల్లో కరివేపాకు ఒకటి. వంటకాలకు రుచి, సువాసన ఇస్తూ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. కానీ కేవలం వంటకాల్లోనే కాదు, వాస్తు ప్రకారం కూడా కరివేపాకు మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దాన్ని ఎక్కడ పెంచాలో తెలుసుకోవడం చాలా అవసరం.
లక్ష్మీదేవి కటాక్షంగా…
కరివేపాకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంటే అది గృహంలో సంపదను, సుఖశాంతిని తెస్తుందని చెబుతారు. దాన్ని లక్ష్మీదేవి కటాక్షంగా కూడా భావిస్తారు. కానీ మొక్కని తప్పు ప్రదేశంలో నాటితే దుష్ప్రభావాలు రావచ్చు. వాస్తు నిపుణులు కొన్ని ప్రదేశాల్లో కరివేపాకు పెంచితే మంచిదని, కొన్ని చోట్ల అయితే పెద్ద సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
దక్షిణ దిశలో…
వాస్తు ప్రకారం పశ్చిమ దిశ చంద్రుని శక్తిని సూచిస్తుంది. ఈ దిశలో కరివేపాకు మొక్కను నాటితే ఇంట్లో ఉండే వారికి ఆరోగ్యప్రదమైన ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అలాగే దక్షిణ దిశలో ఈ మొక్కను పెంచితే సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు. అయితే ఎలాంటి దిశలో పెంచినా, ఇంటికి అతి దగ్గరగా కాకుండా కనీసం నాలుగు అడుగుల దూరంలో పెంచడం అవసరం. అలా చేస్తే వాస్తు ఫలితాలు సక్రమంగా వస్తాయని విశ్వసిస్తారు.
ప్రతికూల శక్తులు..
ఇంటి తోటలో కరివేపాకు మొక్కను పెంచితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, అదృష్టం కలిసివస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అందుకే చాలా మంది ఇంటి వెనకభాగంలో లేదా తోట ప్రదేశంలో ఈ మొక్కను నాటుతారు.
కీడు కలిగిస్తుందని ..
అయితే వాస్తు ప్రకారం కొన్ని ప్రదేశాల్లో కరివేపాకు పెంచడం కీడు కలిగిస్తుందని చెబుతారు. ముఖ్యంగా ఈశాన్య మూలలో ఈ మొక్కని నాటకూడదు. అలా చేస్తే ఇంట్లో నివసించే వారికి తరచూ ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయని నమ్మకం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకదాని తర్వాత ఒకటి దురదృష్టకరమైన సంఘటనలు కూడా ఎదురవుతాయని తెలుస్తుంది.
ఇంటి గుమ్మం దగ్గర..
ఇక మరో ప్రదేశం ఇంటి ప్రధాన ద్వారం వద్ద. కరివేపాకు మొక్కని ఇంటి గుమ్మం దగ్గర నాటితే ఆర్థిక సమస్యలు వస్తాయని, అప్పులు పెరుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల కరివేపాకు మొక్కను ఎంచుకునే ప్రదేశంలో జాగ్రత్త అవసరం.
సాయంత్రం తర్వాత..
కేవలం మొక్కని ఎక్కడ నాటాలోనే కాదు, ఎప్పుడు దాని ఆకులను కోయాలో కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత కరివేపాకు కోయరాదు. అలాచేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని చెబుతారు. అందువల్ల ఉదయం లేదా పగటి సమయంలోనే కరివేపాకు కోయడం మంచిదని సూచిస్తారు.
ఆరోగ్యం, సంపద, ఆనందం..
కరివేపాకు వంటింట్లో తప్పనిసరి పదార్థమే అయినా, వాస్తు ప్రకారం అది ఇంటి శ్రేయస్సుకు కూడా ప్రభావం చూపుతుంది. సరైన దిశలో, సరైన ప్రదేశంలో పెంచితే కుటుంబానికి ఆరోగ్యం, సంపద, ఆనందం కలిసివస్తాయని విశ్వాసం ఉంది. కానీ తప్పు ప్రదేశంలో పెంచితే ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, దురదృష్టకర సంఘటనలు సంభవిస్తాయని నమ్మకం.
వాస్తు నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కరివేపాకు మొక్కను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. అది ఎండిపోతుంటే వెంటనే కొత్త మొక్కను నాటాలి. ఆరోగ్యంగా, పచ్చగా ఉండే కరివేపాకు మొక్క గృహానికి సానుకూల శక్తిని అందిస్తుందని వారు చెబుతున్నారు


