Navratri 2025 Dreams: హిందువులు దేవీ నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు సెప్టెంబరు 22న ప్రారంభమై.. అక్టోబర్ 02తో ముగియనున్నాయి. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారి యెుక్క 9 రూపాలను పూజిస్తారు. భక్తులు ఉపవాసం ఉంటూ దుర్గాదేవిని పూజిస్తారు. అయితే నవరాత్రి సమయంలో కలల రావడం చాలా శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి డ్రీమ్స్ వస్తే మీకు మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
కలలో దుర్గాదేవి కనిపించడం:
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో దుర్గాదేవిని చూడటం శుభప్రదంగా భావిస్తారు. దీంతో మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. అంతేకాకుండా మీ కెరీర్ లో విజయం కూడా ఉంటుంది.
సింహాన్ని కలలో చూడటం:
నవరాత్రి సమయంలో కలలో సింహాన్ని చూడటం శుభ సూచకంగా భావిస్తారు. డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ పర్వదినాల్లో డ్రీమ్ లో సింహాన్ని చూడటం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. మీరు కెరీర్ లో స్థిరపడటంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు.
కలలో అమ్మాయి కనిపిస్తే:
దేవీ నవరాత్రుల్లో కలలో అమ్మాయిని చూడటం మంచిదట. ఇది సంపద, శ్రేయస్సు రాకను సూచిస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి. నవ్వుతున్న బాలిక కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు.
కలలో లక్ష్మీదేవి కనిపిస్తే:
దసరా సమయంలో కలలో లక్ష్మీదేవిని చూడటం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మీకు డబ్బుకు కొదవ ఉండదు.
పూజ చేస్తున్నట్లు కలలు కంటే:
విజయ దశమి ఉత్సవాల సమయంలో పూజలు చేస్తున్నట్లు కలలు కన్నట్లయితే..అది మీకు లాభిస్తుంది. మీ వ్యాపారంలో ఊహించని ప్రాఫిట్స్ ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Navaratri 2025-రెండో రోజు అవతారం బ్రహ్మచారిణి.. ఎలా పూజించాలో తెలుసా?
పార్వతి దేవి కలలోకి వస్తే:
నవరాత్రుల సమయంలో పార్వతీ దేవిని కలలో చూడటం చాలా అదృష్టంగా భావిస్తారు. మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.
కలలో దీపం కనిపిస్తే:
శరన్నవరాత్రుల సమయంలో డ్రీమ్ లో దీపం కనిపించడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితిలో ఎన్నడూ చూడని ఎదుగుదల ఉంటుంది.
Also Read: Navratri 2025 -నవరాత్రుల్లో అర్ధ కేంద్ర రాజయోగం.. ఈ మూడు రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..
దుర్గాదేవి ఆలయం కనిపిస్తే:
దసరా సమయంలో కలలో దుర్గాదేవి ఆలయాన్ని చూసినట్లయితే ఆ కుబేరుడి యెుక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి.
కలలో కమలం పువ్వు వస్తే:
నవరాత్రుల్లో కమలం పువ్వు కనిపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండటంతోపాటు ఆర్థికంగా లాభపడతారు.
Disclaimer: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల పై ఆధారపడి ఉంది. దీనిని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

