పాలకుర్తి(తెలుగుప్రభ): దసరా పండుగ మంగళవారం నిర్వహించడం పట్ల ప్రజలకు కలుగుతున్న అనుమానాలను ప్రముఖ సిద్ధాంతి పాలకుర్తి గౌతమ్ శర్మ నివృత్తి చేశారు. శనివారం సిద్ధాంతి గౌతమ్ శర్మ దసరా పండగ నిర్వహణపై వస్తున్న పుకార్లపై స్పందించారు. అమ్మవారి అనుగ్రహం ప్రకారం మంగళవారం దసరా నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేశారు. మంగళవారం ఆయుధపూజ చేయవద్దనే అపోహ సరికాదన్నారు. యధావిధిగా పంచాంగం ప్రకారం మంగళవారం దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని అన్నారు.
Palakurthi: మంగళవారమే దసరా.. స్పష్టం చేసిన సిద్ధాంతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

