Saturday, November 15, 2025
HomeదైవంDeepavali 2025: దీపావళి నాడు పూజలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?

Deepavali 2025: దీపావళి నాడు పూజలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?

- Advertisement -

Diwali Puja 2025 Dos and Don’ts: దేశంలో దీపావళి సందడి నెలకొంది. ఈ పండుగను జరుపుకునేందుకు దేశం మెుత్తం సిద్దమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే ఈ ఫెస్టివల్ రేపు అంటే అక్టోబర్ 20న రాబోతుంది. ఈరోజున లక్ష్మీదేవి మరియు గణేశునికి పూజిస్తారు. అయితే శుభకరమైన రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

దీపావళి పూజలో చేయాల్సినవి:

**ఈ రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఏ మూల కూడా వదలకుండా క్లీన్ గా ఉంచాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు.

**చీకటిని పారద్రోలడానికి మరియు సానుకూలతను ఆహ్వానించడానికి ప్రమిదల్లో నూనె దీపాలను వెలిగించండి. అతిథులను మరియు దైవిక శక్తిని స్వాగతించడానికి ఇంటి గుమ్మం వద్ద అందమైన ముగ్గులను వేయండి.

**ప్రదోష కాలంలో దీపావళి పూజ చేయండి. లక్ష్మీదేవి ఆరాధించడానికి మంచి ముహూర్తం సాయంత్రం 6:22 నుండి రాత్రి 8:06 గంటల మధ్య ఉంటుంది.

**ఓ పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి లక్ష్మీదేవి మరియు గణేశుడి విగ్రహాలను లేదా ఫోటోలను ఉంచండి. అనంతరం పూజలో కలశం, దీపం, విగ్రహాలు, ధూపం మరియు పువ్వులు వంటి వస్తువులను ఉపయోగించండి.

**పూజ చేసేటప్పుడు మంత్రాలు పఠించడంతోపాటు కీర్తనలు అలపించండి. ఇంట్లో తయారుచేసిన స్వీట్లును నైవేద్యంగా సమర్పించండి. ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి.

Also Read: Diwali Vastu – దీపావళి నాడు ఇలా చేశారంటే..లక్ష్మీ కటాక్షం మీ మీదే..!

దీపావళి పూజలో చేయకూడనివి:

**స్నానం చేయకుండా దీపాలు వెలిగించవద్దు

**విరిగిన లేదా పగిలిన లేదా పాత వస్తువులను పూజలో ఉపయోగించకండి. మురికి పాత్రలను కూడా వాడొద్దు.

**పూజ చేసే ప్రదేశం చాలా పవిత్రంగా ఉండాలి. అందుకే ఆ ప్రాంతానికి దగ్గరలో పాదరక్షలు లేకుండా చూసుకోండి.

**పర్వదినాన స్వీట్లు వంటి పదార్థాలు అతిగా తినకండి.

**కాలుష్యం లేదా హాని కలిగించే క్రాకర్లను పేల్చకండి. పర్యావరణ అనుకూలమైన క్రాకర్లు పేల్చడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad