Saturday, November 15, 2025
HomeదైవంPrabodhini Ekadashi 2025: ప్రబోధిని ఏకాదశి నవంబరు 01నా లేదా 02నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..

Prabodhini Ekadashi 2025: ప్రబోధిని ఏకాదశి నవంబరు 01నా లేదా 02నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..

Prabodhini Ekadashi 2025 Significance: హిందువులకు ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజు శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశుల్లో దేవుత్తుని ఏకాదశి చాలా విశిష్టమైనది. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్లి.. దేవుత్తని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాసం అంటారు. ఈ దేవుత్తని ఏకాదశికే ప్రబోధిని ఏకాదశి అనే పేరు కూడా ఉంది. ఈ ఏకాదశి గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ వ్రత విశిష్టత గురించి స్వయంగా బ్రహ్మదేవుడే నారద మహర్షితో చెప్పాడట. దీనిని ఆచరించిన వారు మరణానంతరం వైకుంఠానికి వెళ్తారని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం దేవుత్తని ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.

- Advertisement -

దేవుత్తుని ఏకాదశి తేదీ, పారణ సమయం
పంచాంగం ప్రకారం, దేవ్ ఉథాని ఏకాదశి తేదీ నవంబర్ 1న ఉదయం 9:12 గంటలకు ప్రారంభమై.. 2న ఉదయం 7:31 గంటల ముగుస్తుంది. సూర్యోదయాన్ని బట్టి నవంబర్ 2న దేవ్ ఉథాని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఏకాదశి తర్వాత రోజున పారణ సమయం ఉంటుంది. నవంబర్ 3, ఉదయం 05:48 నుండి 08:03 వరకు మంచి సమయం. అదే రోజు ద్వాదశి తిథి సూర్యోదయానికి ముందే ముగుస్తుంది.

Also Read: Mangal Gochar 2025 – వృశ్చిక రాశిలో బుధుడు-కుజుడు కలయిక.. ఈ 3 రాశులకు సుడి తిరగబోతుంది ఇక..

ప్రబోధిని ఏకాదశి ప్రాముఖ్యత
దేవుత్తని ఏకాదశితో చాతుర్మాసం ముగుస్తుంది. ఈ రోజు నుంచే వివాహ శుభ కార్యాలు, గృహ ప్రవేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తుల కోరికలను ఆ శ్రీహరి నెరవేరుస్తాడు. వారు జీవితంలో ఆనందంతోపాటు శ్రేయస్సు కూడా పొందుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ పవిత్రమైన రోజునే తులసి వివాహ వేడుకను నిర్వహిస్తారు. ఈ దేవుత్తని ఏకాదశినే మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో ప్రబోధిని ఏకాదశిగా జరుపుకుంటారు. అక్కడ నెల రోజుల పాటు జరిగే పుష్కర ఉత్సవం ఇదే రోజున ప్రారంభమవుతుంది. పండర్‌పూర్ యాత్ర ప్రబోధిని ఏకాదశితోనే ముగుస్తుంది. ఈ పర్వదినాన పవిత్ర నదుల్లో లేదా జలాశయాల్లో స్నానమాచరించడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad